Site icon vidhaatha

పడేసిన పాల ప్యాకెట్లు.. అధికారుల నిర్లక్ష్యం

విధాత,అనంతపురం:కదిరిపట్టణంలో గజ్జలరెడ్డిపల్లి సమీపంలో పడేసిన పాల పాకెట్లు.పౌష్టికాహార లోపంతో బాధపడేవారికి అందాల్సిన పాలప్యాకెట్లు అధికారులు,సిబ్బంది నిర్లక్ష్యంతో నేలపాలవుతున్నాయికదిరి పరిసరాల్లో వారం రోజుల వ్యవధిలోనే వందల లీటర్ల పాలప్యాకెట్లు రోడ్డుపక్కన, రహదారి పరిసర ప్రాంతాల్లో పాడేశారు. జులై 26న కదిరి మండలం కౌలేపల్లి సమీపంలోని ఎస్వీ కళాశాల వద్ద జాతీయ రహదారి పక్కన వందలాది లీటర్ల పాల ప్యాకెట్లను పారబోశారు.తాజాగా గజ్జలరెడ్డిపల్లి సమీపంలోని పుట్టమానిచెరువులో వందల లీటర్ల పాలప్యాకెట్లను మళ్లీ గుట్టలుగా పడేశారు. పిల్లలు, గర్భిణులకు అందించాల్సిన పాలప్యాకెట్లను ఇలా నేలపాలుచేస్తున్న సిబ్బందిపై అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version