Site icon vidhaatha

Botsa Satyanarayana | విశాఖ పోర్టులో డ్రగ్‌ కంటైనర్‌ కేసు విచారణ జరిపించాలి: మాజీ మంత్రి బొత్స

25కోట్ల అక్రమ డ్రగ్స్ పోర్టుకు వచ్చాయో లేదో తేల్చాలి
వాస్తవాలు ప్రజల ముందుంచాలి
మాజీ మంత్రి బొత్స డిమాండ్

విధాత, హైదరాబాద్ : విశాఖ పోర్టులో డ్రగ్‌ కంటైనర్‌ కేసుపై విచారణ కొనసాగించి వాస్తవాలు ప్రజల ముందుంచాలని ఏపీ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రగ్‌ కంటైనర్‌తో వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని, తమ ప్రభుత్వ హయాంలో టీడీపీ ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉంది కాబట్టి దీనిపై విచారణ జరిపించాలని సవాల్‌ విసిరారు. ఆపరేషన్‌ గరుడ పేరుతో ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలు భారీ మొత్తంలో డ్రగ్స్‌ పట్టుకున్నాయని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. .బ్రెజిల్‌ నుంచి వచ్చిన డ్రగ్స్‌ కంటైనర్‌ కేసులో అప్పుడు మేం అధికారంలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉందని ఆరోపించారన్నారు.

ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే ఉన్నందునా విచారణ జరిపించాలన్నారు. సంధ్యా ఆక్వా మెరైన్‌ కంపెనీ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బంధువులదే అని ఆరోపణలు కూడా వచ్చాయన్నారు. దీనిపై ఉత్తరాంధ్ర ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్ర ప్రతిష్ట కోసం విచారణను కోరుతున్నామని చెప్పారు. రెడ్ బుక్‌నో, బ్లూ బుక్‌నో, బ్లాక్ బుక్‌నో కాదని, ముందు మీ చేతిలో ఉన్న బుక్కులు తెరిస్తే వైజాగ్‌ ల్యాండ్‌ స్కాంపై నిజాలు బయటకు వస్తాయని బొత్స సత్యనారాయణ తెలిపారు. అసలు 25వేల కోట్ల విలువైన డ్రగ్‌ విశాఖ పోర్టుకు వచ్చాయా? లేదా? అనేది తేలాలని చెప్పారు. ఈ కంటైనర్‌ కేసులో పాత్రధారులు ఎవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. రేపు వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు. 45 రోజుల పాలనలో జరిగిన హత్యలకు గురైన వాళ్ల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

Exit mobile version