Site icon vidhaatha

జూన్‌ 3న మంత్రుల పేషీలు.. చాంబర్ల స్వాధీనం

ఏపీ జీఏడీ ఆదేశాలు

విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయాల సిబ్బందికి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దని ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వశాఖల్లోని దస్త్రాలు, కాగితాలను తరలించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. వాహన తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయం భద్రతను చూసే ఎస్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని, ఆ లోగా వాటిని ఖాళీ చేయాల్సిందిగా జీఏడీ ఆదేశించింది.

 

Exit mobile version