విధాత: ఆదివాసీనాయకులను చర్చలకు పిలిచి .మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిగారితో సహా అందరిని కటికనేలపై కూర్చోబెట్టడం అధికారదర్పం,నిరకుశత్వం అని అర్థమవ్వుతోందన్నారు గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు దొర.
గిరిజన సంక్షేమంకోసం,గిరిజనల అభివృద్ధి కోసం ఏర్పాటైన ఐటీడీఏలొనే గిరిజనులకు అవమానం జరిగితే ఇంకా ఆదివాసీల హక్కులు ఎక్కడ పనిచేస్తున్నట్టు…ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు గిరిజనలను గిరిజనమహిళలను,గిరిజననాయుకులను చులకనగా చూడడంపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పితీరాలి.
ఇప్పుడున్న అధికార పార్టీ 7 గురు ఎమ్మెల్యేలు పెదవి విప్పండి…లేకపోతే రేపు మీకు ఇదే సమస్య ఎదురవ్వొచ్చు..రాజ్యాంగం మహిళలను గౌరవించడం మన బాధ్యత అని చెప్తోంది.కానీ కులవివక్ష అధికార దర్పం చూపుతూ ఆదివాసీలు మా కాలుకిందే బతకాలి అన్నట్టు ప్రవర్తిస్తున్న ఇలాంటి అధికారుల తమ వైఖరి మార్చుకోకపోతే ఆదివాసీల ఆవేశం చూడాల్సి వస్తుంది…వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రాజెక్ట్ ఆఫీసర్ పై చర్యలు తీసుకొని.మాజీమహిళ ఎమ్మెల్యేకు గిరిజననాయుకులకు క్షపాపణ చెప్పించాలి.