విధాత, హైదరాబాద్ : హైదరాబాద్‌ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణకు ఉన్న హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు జూన్ 2వ తేదీతో ముగిసిపోవడం విచారకమన్నారు. ఏపీకి రాజధాని లేకపోవడం..విభజన సమస్యలు అపరిష్కృతంగా ఉండటం వంటి పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరాలు పొడిగించాలని డిమాండ్ చేశారు.
మరో పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలి ..ఏపీ పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్
