Site icon vidhaatha

జ‌గ‌న‌న్నా.. నిన్ను చూడాలని ఉంది

విధాత‌: అన్నా రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాను.. నిన్ను చూడాలనుందన్నా అంటూ సరస్వతీ నగర్‌కు చెందిన ఆర్‌ విజయకుమారి అనే మహిళ తన కుమార్తె ద్వారా సీఎం వైఎస్‌.జగన్‌కు విన్నవించుకుంది. వరద ప్రాంతాల పర్యటలో భాగంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలో సరస్వతినగర్ వచ్చిన సీఎం జగన్‌కు తన తల్లి విజయ కుమారి కోరికను కుమార్తె వైష్టవి తెలియజేసింది.

దీంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంకా కోలుకోని ఆర్‌ విజయకుమారిని స్వయంగా ఇంట్లోకి వెళ్లి పరామర్శించిన సీఎం ఆమెకు ప్రమాదం జరిగిన తీరును, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించా రు. సీఎం వైయస్ జగన్ నేరుగా తమ ఇంటికి వచ్చి పరామర్శించడంపై విజయకుమారి, ఆమె భర్త గజేంద్ర, కుమార్తె వైష్ణవి హర్షం వ్యక్తం చేశారు.

Exit mobile version