విధాత : తిరుమల దేవస్థానం వెళ్లే రెండో ఘాట్ లో ఓ పెద్ద కొండ చిలువ కలకలం రేపింది. రాత్రి వేళ రోడ్డు దాటుతున్న కొండ చిలువను భక్తులు గమనించారు. వినాయక స్వామి ఆలయం దాటుకొని కారులో వెళ్తున్న కొందరు భక్తులు కొండచిలువను చూసి దానిని తమ ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
తిరుమల వెంకన్న కొలువైన ఏడు కొండలు శేషాచలం అడవులతో కూడిన కొండలే. దీంతో తరచు ఘాట్ రోడ్డులలో చిరుత పులులు, ఇతన వన్య మృగాలు, సరీ సృపాలు దర్శనమిస్తుంటాయి. కోబ్రాలు, కొండ చిలువలు ఎక్కువగా తిరుమల మార్గంలో, యాత్రీకుల కాటేజీలలో తరుచు కనిపిస్తుండటం కొంత ఆందోళన కరంగా మారింది.
తిరుమల రెండో ఘాట్ లో రోడ్డు దాటుతున్న పెద్ద కొండచిలువ. Python crossing road in the second ghat. #tirumalahills pic.twitter.com/nkE2xxxn5x
— GoTirupati (@GoTirupati) November 5, 2025
