Site icon vidhaatha

Minister Nara Lokesh | జనం సొమ్ముతో ఫ్యాలెస్‌ల మాదిరిగా పార్టీ ఆఫీసులా: మంత్రి నారా లోకేశ్‌ ఫైర్‌

రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా

విధాత : మాజీ సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పార్టీ ఆఫీసుల పేరిట ప్రజాధనంతో విలాసవంతమైన ఫ్యాలెస్‌లను తలపించే భవనాలను నిర్మించడంపై మంత్రి నారా లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా ఫైర్‌ అయ్యారు. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావని, జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్.

నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు. ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా? అని లోకేశ్‌ తన ట్వీట్‌లో జగన్‌ తీరుపై మండిపడ్డారు. తన ట్విట్‌లో ఏలూరు, శ్రీకాకుళం, నెల్లూరు, రాయచోటి వైసీపీ కార్యాయల భవనాల ఫోటోలను జత చేశారు. నారా లోకేశ్‌ చేసిన ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Exit mobile version