Site icon vidhaatha

AP | ఏపీలో అధికారులపై కొనసాగుతున్న చర్యలు.. ఆర్వో..డీఎస్పీలపై వేటు

విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘటనలకు సంబంధించి విధి నిర్వాహణలో విఫలమైన అధికారులపై చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీలేఖను తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి మీనా కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈనెల 13న జరిగిన పోలింగ్‌లో యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఘర్షణలు జరిగిన సమయంలో సకాలంలో స్పందించకపోవడంతో ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు తెలిపారు. గురువారం నియోజకవర్గానికి కొత్త ఆర్వోను కలెక్టర్ నియమించనున్నట్లు చెప్పారు. మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన డీఎస్పీ యశ్వంత్‌కుమార్‌పై వేటు పడింది. ఆయనను తక్షణమే డీజీపీ కార్యాలయంలో సరెండర్‌ కావాలంటూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు

Exit mobile version