Pawan Kalyan : మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై పవన్ కల్యాణ్ వీడియో

మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై పవన్ కల్యాణ్ వీడియో విడుదల. చిత్తూరు జిల్లాలో 76.74 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఆరోపణ.

Pawan Kalyan

అమరావతి : చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుటుంబసభ్యుల అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వీడియో విడుదల చేశారు. పవన్ వీడియో షూటింగ్..విడుదల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిత్తూరు జిల్లాలో ఏరియల్‌ సర్వే నిర్వహించిన సమయంలో పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ వీడియోలను పవన్‌ హెలికాప్టర్ నుంచి వీడియోలు తీశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు పవన్ పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేశారని తెలిపారు. విజిలెన్స్‌ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా పవన్ వెల్లడించారు.