Road Accident | హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం వద్ద వేగంగా దూసుకెళ్తున్న ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో స్వల్పంగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది.
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ప్రయివేటు ట్రావెల్స్ బస్సు చిత్తూరు జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో పోలీసులు, ట్రావెల్స్ డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
NH–44 పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు
దట్టంగా వ్యాపించిన పొగలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బస్సు దిగిన ప్రయాణికులు
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలో యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన జగన్… pic.twitter.com/VGXqBZbH9i
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2025
