Site icon vidhaatha

దేశంలో ఏపీలోనే పెట్రోధరలు ఎక్కువ

విధాత‌:పెట్రోలు, డీజిల్‌ ధరలు బుధవారం నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే అధికంగా ఉండను న్నాయి. పెట్రో ధరల్లో ఇప్పటి వరకు తొలిస్థానంలో నిలిచిన రాజస్థాన్‌ ఒక మెట్టు దిగొచ్చింది. లీటరు పెట్రోలుపై రూ.4, డీజిల్‌పై రూ.5 చొప్పున తగ్గిస్తున్నట్లు మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. తగ్గిన ధరలు ఆ అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

బుధవారం నుంచి జైపుర్‌లో పెట్రోలు లీటరు రూ.107.08. డీజిల్‌ రూ.90.70 చొప్పున లభించనున్నాయి. ప్రస్తుతం విజయవాడలో ఈ ధరలు వరుసగా రూ.110.03, రూ.96.08 చొప్పున ఉన్నాయి. రాజస్థాన్‌తో పోలిస్తే.. ఏపీలో లీటరుకు పెట్రోలుపై రూ.2.95, డీజిల్‌పై రూ.5.40 అధికం.

ఈ రెండు రకాల ఇంధన ధరల్లో ఏపీ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తెలంగాణ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్‌ సవరణల తర్వాత దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోనే పెట్రోలు ధర లీటరు రూ.105 పైబడి ఉంది. డీజిల్‌ రూ.90 పైబడిన రాష్ట్రాలు 9 ఉన్నాయి.

Exit mobile version