Pinnelli brothers surrender| మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరుల సరెండర్

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలు గురువారం పల్నాడు జిల్లా మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ కోర్టు జడ్జి ముందు లొంగిపోయారు. అనంతరం పోలీసులు వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపించారు.

అమరావతి : మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి(Pinnelli brothers surrender)లు గురువారం పల్నాడు జిల్లా మాచర్ల(Macharla court)లోని జూనియర్ అదనపు సివిల్ కోర్టు జడ్జి ముందు లొంగిపోయారు. అనంతరం పోలీసులు వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపించారు. అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామి రెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం పిన్నెల్లి సోదరులను పోలీసులు భారీ బందోబస్తు మధ్య నెల్లూరు జైలుకు తరలించారు.

గుండ్లపాటు టీడీపీ నేతలు, సోదరులైన జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు మే 24న హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యకేసులో పరోక్షంగా సహకరించారని పోలీసులు పిన్నెల్లి సోదరులను ఏ6, ఏ7గా చేర్చి కేసు నమోదు చేశారు. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కింది కోర్టు, హైకోర్టు రద్దు చేయగా.. సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. అక్కడ కూడా బెయిల్‌ పిటిషన్‌ రద్దయింది. నిందితులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలు రెండు వారాల్లో లొంగిపోవాలని గత వారం సుప్రీం ఇచ్చిన ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు ఈ రోజు మాచర్ల కోర్టులో లొంగిపోయారు.

పిన్నెల్లి సోదరుల లొంగుబాటు నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ముందుస్తుగా అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాచర్లలో 144సెక్షన్ విధించారు. పలు నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు పిన్నెల్లి సోదరులకు మద్దతుగా ర్యాలీగా వెళ్లడానికి సిద్దమవ్వగా పోలీసులు అనుమతించలేదు. పలువురు వైసీపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు.

Latest News