Maoists| నేడు తెలంగాణ డీజీపీ ముందు భారీగా మావోయిస్టుల లొంగుబాటుఁ

నేడు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. లొంగిపోనున్న మావోయిస్టుల్లో కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు మొత్తం 37మంది మావోయిస్టులు ఉన్నట్లుగా సమాచారం.

విధాత, హైదరాబాద్ : మావోయిస్టులకు మరో బిగ్ షాక్ ఎదురైంది. నేడు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. లొంగిపోనున్న మావోయిస్టుల్లో కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు మొత్తం 37మంది మావోయిస్టులు ఉన్నట్లుగా సమాచారం. లొంగిపోయే వారిలో అజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు వంటి ముఖ్య నాయకులు ఉన్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్న డీజీపీకూడా ఉన్నారని సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో మావోయిస్టుల లొంగుబాటు వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించనున్నారు.

Latest News