Maoist Encounter : తొమ్మిదికి చేరిన చత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ మృతుల సంఖ్య!

చత్తీస్‌గఢ్ గడ్చిరోలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు–భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 9కు చేరింది. ఒక కమెండో మృతి చెందగా, గాలింపు కొనసాగుతోంది.

Maoist Encounter

విధాత : చత్తీస్ గఢ్ గడ్చిరోలి అటవీ ప్రాంతం మరోసారి మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులతో దద్దరిల్లింది. గడ్చిరోలి జిల్లాలోని పొదవాడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో తొలుత ముగ్గురు మావోయిస్టులు చనిపోగా, ఆ తర్వాత మృతుల సంఖ్య 9 మందికి పెరిగింది. ఎన్ కౌంటర్ కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో భద్రత బలగాలకు చెందిన కమెండ్ దీపక్ మడావి మృతి చెందారు. మరో జవాన్ కు గాయలవ్వగా ఆసుపత్రికి తరలించారు. ఎన్ కౌంటర్ ప్రాంతానికి అదనపు భద్రతా బలగాలను తరలించి మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

ఘటన స్థలంలో ఒక ఏకే 47, ఒక ఎస్ఎల్ఆర్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. నిన్న బీజాపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత ఉదమ్ సింగ్ సహా మరొకరు మృతి చెందిన సంగతి తెలిసిందే.

మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు మార్చి 31తో ముగియ్యనున్న నేపథ్యంలో భద్రతబలగాలు మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. చత్తీస్ గఢ్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 9నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కు సంబంధించి తుది కార్యాచరణ ఖరారు చేస్తారని సమాచారం.

ఇవి కూడా చదవండి :

BRS MLA Disqualification Case : అప్పటిలోగా తేల్చకపోతే చర్యలు : స్పీకర్ కు సుప్రీం డెడ్ లైన్!
Seetha Payanam Movie : యాక్షన్ కింగ్ అర్జున్ ‘సీతా పయనం’… ఐశ్వర్య అర్జున్ గ్రాండ్ లాంచ్

Latest News