Site icon vidhaatha

SCR | ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ స్టేషన్లలో ఈ రైళ్లు కొత్తగా స్టాపింగ్‌.. లిస్ట్‌లో మీ ఊరుందా చూసుకోండి..!

SCR | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. గతంలో చెన్నై, విశాఖ, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లకు తాజాగా నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో స్టాపింగ్‌ను ఎత్తివేసిన విషయం తెలిసిందే. తాజాగా రైల్వేశాఖ ఆయా స్టేషన్లలో మళ్లీ స్టాపింగ్‌ ఇస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో రెండు స్టేషన్ల పరిధిలోని ప్రయాణికులకు ఎంతో ఊరట కలుగనున్నది. గత కొద్దిరోజుల రైళ్లకు స్టాపింగ్‌ ఇవ్వాలని ప్రజలు కోరుతూ వస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు స్టాపింగ్‌ ఇచ్చారు. కరోనా సంక్షోభం సమయంలో నారాయణాద్రి, చెన్నై, విశాఖ ఎక్స్ ప్రెస్ లను నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో స్టాపింగ్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాల ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ రైళ్లు అందుబాటులో లేకుండా పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అదే సమయంలో దక్షిణ మధ్య రైల్వే 69 రైళ్లకు కొత్తగా స్టాప్‌లను ఇచ్చింది. హజ్రత్‌ నిజాముద్దీన్‌ – తిరుపతి (12708), సికింద్రాబాద్‌ – రాయ్‌పూర్‌ (12771) రైళ్లకు బెల్లంపల్లి, ఎర్నాకులం – పట్నా (22669) రైలుకు ఖమ్మం.. తిరుపతి – సికింద్రాబాద్‌ (12763) పద్మావతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం – మహబూబ్‌నగర్‌ (12681) రైలుకు మధిర, నిజాముద్దీన్‌ – తిరుపతి (12708), ఎర్నాకులం – పట్నా ( 22669) రైళ్లకు మంచిర్యాలకు ఇచ్చారు. వీటితో పాటు రామగుండం, గూడురు జంక్షన్‌, ఉప్పలూరు, చీరాల, తాడిపత్రి, గుత్తి, సత్తెనపల్లి, మంగళగిరి, మిర్యాలగూడ, నల్గొండ, గద్వాల, మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌, మర్పల్లి, వరంగల్‌, పెద్దపల్లి స్టేషన్లలో పలు రైళ్లకు కొత్తగా స్టాపింగ్‌ ఇస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version