181 మందికి సీఐ లు గా ఒకేసారి పదోన్నతి – పోలీసు శాఖ చరిత్రలో ఒక మైలు రాయి – డీజీపీ

రూల్ ఆఫ్ లా ను పకడ్బందీగా అమలుపరచాలన్నా, ప్రజల ధన మాన ప్రాణాలకు భరోసా గా ఉండాలన్నా, పోలీస్ శాఖ 24 గంటలూ పనిచేయాల్సి ఉంటుంది. అందుకే మనసెరిగిన ముఖ్యమంత్రి ఒక వైపు పోలీసుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలుపరుస్తూ, మరో వైపు వృత్తి పరమైన అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే పోలీస్ శాఖలో సమూల సంస్కరణలు మరియూ మార్పు అవసరాన్ని గుర్తించి తదనుగుణంగా పారదర్శకత, జవాబుదారితనం, సత్వర స్పందన, భాధ్యతాయుతమైన సేవలే […]

  • Publish Date - May 29, 2021 / 02:56 PM IST

రూల్ ఆఫ్ లా ను పకడ్బందీగా అమలుపరచాలన్నా, ప్రజల ధన మాన ప్రాణాలకు భరోసా గా ఉండాలన్నా, పోలీస్ శాఖ 24 గంటలూ పనిచేయాల్సి ఉంటుంది.

అందుకే మనసెరిగిన ముఖ్యమంత్రి ఒక వైపు పోలీసుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలుపరుస్తూ, మరో వైపు వృత్తి పరమైన అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే పోలీస్ శాఖలో సమూల సంస్కరణలు మరియూ మార్పు అవసరాన్ని గుర్తించి తదనుగుణంగా పారదర్శకత, జవాబుదారితనం, సత్వర స్పందన, భాధ్యతాయుతమైన సేవలే పరమావధిగా అడుగులేశారు.

ఏళ్ల తరబడి శాఖ లో విధులు నిర్వహిస్తూ, సరైన సమయంలో పదోన్నతులు లభించకపోవడం తో కానిస్టేబుల్ మొదలుకొని ఎస్పీ స్థాయి అధికారి వరకు, నిరాశానిసృహలతో ఉన్నట్లు గుర్తించారు.

గత ఏడేళ్లుగా పోలీస్ శాఖలో అసంపూర్తిగా మిగిలిపోయిన పదోన్నతులపై డి‌జి‌పి గారు ఇచ్చిన నివేదిక మేరకు ముఖ్యమంత్రి స్పందిస్తూ, సిబ్బందికి కల్పించాల్సిన పదోన్నతులపై తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించడం జరిగింది.

వారి ఆదేశాలకు అనుగుణంగా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టిన డిజిపి ముగ్గురు సీనియర్ IPS అధికారులతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో అడిషనల్ డి‌జి సంజయ్, హరీష్ కుమార్ గుప్తా, శంకబ్రత బాగ్చి లు వున్నారు.

ఈ కమిటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ గారి పర్యవేక్షణలో గత ఆరు నెలలుగా పలు సార్లు సమావేశమైంది. రాష్ట్రం లోని విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు మరియూ కర్నూలు రేంజ్ ల డీఐజీ లను, రేంజ్ సిబ్బంది ని పిలిపించి, రికార్డులను, డాక్యుమెంట్ లను పరిశీలించి, ACR లను సమీక్షించి, లోపాలను సరిదిద్ది, అన్ని రేంజ్ ల పరిధిలో ఉన్న ఖాళీల సంఖ్య, ఎస్సై నుండి ఇన్స్ పెక్టర్ పదోన్నతికి అర్హత కల్గిన వారి జాబితాను పరిశీలించి, రేంజ్ డీఐజీ ల నుండి నివేదికలను తెప్పించుకుని నాలుగు రేంజ్ ల పరిధిలో ఉన్న 181 ఇన్స్ పెక్టర్ పోస్టుల ను ప్రమోషన్ల ద్వారా అన్ని రేంజ్ లలో ఏక కాలంలో భర్తీ చేయాలన్న ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసు చరిత్ర లొనే ఒక మైలు రాయి. అన్ని రేంజ్ లలో ఒకే రోజు ప్రమోషన్ లు ఇవ్వడం ద్వారా సీనియారిటీ పరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించినట్లైంది.

రాష్ట్ర విభజన అనంతరం దాదాపు 7 సంవత్సరాల పాటు ఇరు రాష్ట్రాల డిఎస్పీ ల మధ్య సీనియారిటీ సమస్య తెగక, ప్రమోషన్ లకు నోచుకోక వందలాది మంది డీఎస్పీ లు ఇబ్బందులు బడ్డ విషయం అందరికీ విదితమే. దానిని గుర్తించి, డీజీపీ గారు గత సెప్టెంబరు మాసంలోనే , కోర్టులలో లిటిగేషన్ లో పడ్డ వారి సీనియారిటీ లిస్టులను సరి చేసి విభజన ప్రక్రియ ను దిగ్విజయంగా పూర్తి చేశారు. దాని వల్ల వందలాది మంది డీఎస్పీ లు ప్రమోషన్లు పొంద గలిగారు.

అడిగిందే తడవుగా, ముఖ్యమంత్రి గారు 18 దిశ పోలీసు స్టేషన్లలో డీఎస్పీ మరియూ ఇతర పోస్టుల ను మంజూరు చేయడం, అదేవిధంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో లో అదనపు పోస్టులు మంజూరు చేయడం ద్వారా, అనేక మంది సిబ్బంది త్వరితగతిన ప్రోమోషన్ లు పొందగలిగారు.

పోలీసు శాఖ లో ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్టులు, డైరెక్ట్ రిక్రూట్ మరియూ ప్రమోటీ ఆఫీసర్ ల మధ్య సీనియారిటీ సమస్యల పరిష్కారం, సకాలంలో సీనియారిటీ లిస్ట్ ల తయారు, సకాలంలో పోలీస్ ఆఫీసర్లకు పదోన్నతులు, బదిలీలలో పారదర్శకత, అవార్డులు, రివార్డుల ప్రదానంలో నిష్పాక్షికత, సకాలంలో జీతభత్యాలు, TA లు, DA లు మంజూరు, వార్షిక ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు ఆటోమేటిక్ గా అందించడం, సర్వీస్ రిజిస్టర్ల ఆటోమాటిక్ అప్ డేషన్ లక్ష్యాలుగా ఒక వైపు ఆటోమేటెడ్ పోలీస్ ఆన్ లైన్ సిస్టం (APOLIS), మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశమైన HCM (Human Capital Management) లను పోలీసు శాఖలో పైలట్ మోడ్ గా అమలు పరిచే క్రమంలో డీజీపీ గారు నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ
టెక్నాలజీ పరంగా దేశం లోనే ముందు క్రమంలో వున్నారు.

రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్కరణలు ఇప్పుడిప్పుడే ఫలితాలిస్తున్నాయి.

డిజిటైజేషన్ దిశగా అడుగులు వేస్తున్న పోలీసు శాఖలో, ఇక ముందు క్రమం తప్పకుండ అర్హులైన ప్రతి ఒక్క సిబ్బందికి, సకాలంలో పదోన్నతులు కలిగే పరిపాలన వ్యవస్థ రూపు దిద్దు కొంటుంది.