శాసన మండలి చైర్మన్ షరీఫ్ కు ఘన వీడ్కోలు

మేలో శాసన మండలి సభ్యులు గా పదవి విరమణ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ షరీఫ్ మహమ్మద్ అహమ్మద్. మండలి ఛైర్మన్ పదవి అల్లా దయ వల్ల వొచ్చింది… నా శక్తీ సామర్ధ్యం వల్ల కాదని నేను నమ్ముతా.. ఇది దేవుడు ఇచ్చిన వరం.. పదవి కోసం ఎప్పుడు పని చేయలేదు, పదవి అడగలేదు. పదవిని అహంకారం గా భవించవొద్ద.. సేవా భావంగా గుర్తించాలి. పదవిలో ఉన్నంతకాలం డబ్బు సంపాదన కోసం కాకుండా ప్రజల మనస్సు […]

  • Publish Date - May 21, 2021 / 05:56 AM IST

మేలో శాసన మండలి సభ్యులు గా పదవి విరమణ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ షరీఫ్ మహమ్మద్ అహమ్మద్.

మండలి ఛైర్మన్ పదవి అల్లా దయ వల్ల వొచ్చింది…

నా శక్తీ సామర్ధ్యం వల్ల కాదని నేను నమ్ముతా..

ఇది దేవుడు ఇచ్చిన వరం.. పదవి కోసం ఎప్పుడు పని చేయలేదు, పదవి అడగలేదు.

పదవిని అహంకారం గా భవించవొద్ద.. సేవా భావంగా గుర్తించాలి. పదవిలో ఉన్నంతకాలం డబ్బు సంపాదన కోసం కాకుండా ప్రజల మనస్సు లో చిరస్థాయిగా నిలవాలి.

కార్యకర్త స్థాయి నుండి పార్టీ కోసమే పనిచేశాను. మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్, ఎమ్మెల్సీ, విప్, ఛైర్మన్ గా పనిచేశాను.

పదవి మూలంగా చెడ్డ పేరు రాకూడదు.. అందరిని మెప్పించేలా ప్రయత్నం చేశాను. కొన్ని సంఘటనలు బాధ కలిగించాయి.

మూడు రాజధానుల విషయంలో చాలా వత్తిడి కి లోనుఅయ్యను. ఒకానొక సమయంలో రాజీనామా చేద్దామని అనుకున్నా,ఎప్పుడు కలిసినా నన్ను అత్యంత గౌరవం గా షరీఫ్ అన్నా పిలిచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు గౌరవం అన్నారు.

మూడు రాజధానులు సంఘటన జరిగిన తర్వాత జనవరి 26 న గవర్నర్ ఇచ్చిన హై టీ కార్యక్రమంలో కలిసి నప్పుడు షరీఫ్ అన్నా అని ఆప్యాయంగా పలకరించి, ఎందుకు కలత చెందారని అడిగారు. ఇంతకుముందు పెద్ద పదవులు చేయలేదని, వత్తిడి కి గురైనానని తెలిపా..నన్ను అందరూ సహనశీలి అంటారు.. కానీ యువకుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గొప్ప సహనశీలి అన్నారు.నేను తీసుకున్న నిర్ణయం దైవ కల్పిత నిర్ణయం గా భావించాను.నా సేవా గుణం దైవ సంకల్పిత మన్నారు.తన పదవి కాలంలో తప్పులు జరిగితే, పెద్ద మనస్సు తో అర్ధం చేసుకోవాలి.మీరు చూపిన ప్రేమ అభిమానాన్ని నా గుండెల్లో ఉంచుకుంటా.నా ఛైర్మన్ పదవి కాలంలో సహకారాన్ని అందించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

నాకు 67 సంవత్సరాల వొచ్చింది.. నా శేష జీవితాన్ని అజాత్మికంగా గడపాలని కోరుకుంటున్నా.. కొంత ప్రజా సేవలో కూడా ఉంటాను.శాసన మండలి లో మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్, పేర్ని వెంకట్రమయ్య (నాని) , శ్రీ రంగనాధరాజు, సభ్యులు మాధవ్, కె ఎస్ లక్ష్మణ రావు, డొక్కా మాణిక్య వరప్రసాద్, శమంతకమణి, నారాయణరెడ్డి, పోతుల సునీత, కత్తి నరసింహరెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, షరీఫ్ గారు ఛైర్మన్ గా సభను నడిపించే తీరుతో సభకు వన్నె తెచ్చారన్నారు. వత్తిడి సమయంలో సభ నడిపిన తీరు మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంది. తెలుగు భాష కోసం చేసిన కృషి ఆదర్శం. సభ్యులు అందరూ ఆయన చేసిన సేవలను కొనియాడారు.

ఈ నెల లో పదవి విరమణ చేస్తున్న ఎమ్మెల్యేలు సోము వీర్రాజు, డిసి గోవింద రెడ్డి లకు కూడా మండలి సభ్యులు వీడ్కోలు పలికారు.అనంతరం ఛైర్మన్ ఛాంబరులో మండలి ఛైర్మన్ ను మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్, పలువురు ఎమ్మెల్సీ లు సన్మానించారు.