Site icon vidhaatha

తెలంగాణలోకి నైరుతి రుతు పవనాలు మూడు రోజులు భారీ వర్షాలు

విధాత : నిన్న ఏపీలోని రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. సోమవారం తెలంగాణలోకి ప్రవేశించాయి. నాగర్‌కర్నూలు, గద్వాల, నల్గొండ మీదుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సాధారణంగా జూన్‌ రెండో వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తుంటాయి. కానీ ఈ సారి రెండు వారాల ముందుగానే రాష్ట్రంలోకి వచ్చాయి. ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలుచోట్ల సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

 

 

Exit mobile version