విధాత:విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో కోవిడ్ చికిత్సలో ఉన్న సిబ్బంది కోసం ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్, సింబియోసిస్ సంస్థ సీఈవో ఓరుగంటి నరేష్ 9వేల ఎన్-95 మాస్కులు, 20వేల ట్రిపుల్ లేయర్ మాస్కులను అందించారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీకాకుళం కోవిడ్ నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావుకు మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సహాయం ఎంతో అవసరమని.. తమ వంతు బాధ్యతగా సాయం అందించిన ఓరుగంటి నరేష్ కు జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.