Monkey Pox : ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న మంకీపాక్స్ ఇప్పుడు ఏపీలోనూ కలకలం రేపింది. దుబాయ్నుంచి విజయవాడకు వచ్చిన ఓ చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు వార్తలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందుకోసం విజయవాడ నూతన ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు పడకలతో ఓ వార్డును సిద్ధం చేసింది. అందులో అధునాతన పరికరాలను అందుబాటులో ఉంచింది.
ఈ ప్రత్యేక వార్డును సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్డాక్టర్వెంకటేష్తెలిపారు. అన్ని రకాల ఇంజక్షన్లను అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. ఇప్పటికే భారత ప్రభుత్వం దీనిపై అప్రమత్తమైంది. ఇదిలావుంటే డబ్యూహెచ్వోహెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది.
అదేవిధంగా అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసి విదేశాల నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు చేయాలని తెలిపింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రిలో ఇందుకోసం ప్రస్తుతం 20 పడకలు కేటాయించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు.
లక్షణాలివే..
ఈ సమస్య రాగానే జ్వరం, నొప్పులు, విపరీతమైన చలి, చర్మంపై దద్దర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతునొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇది వచ్చిన వారికి సన్నిహితంగా ఉండడంతో వస్తుంది. చెమట, ఇతర శరీర ద్రవాల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వ్యాధి వచ్చిన వారు వాడే వస్తువులు, బట్టలు, మంచం, దిండు వంటివి వాడడంవల్ల కూడా ఇతరులకు వస్తుంది. అయితే మంకీపాక్స్ కొవిడ్ లా ప్రమాదకారి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది. కొవిడ్ సమయంలో వ్యవహరించిన తరహాలోనే అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని పేర్కొంది.
మంకీ ఫాక్స్నిర్ధారణకు కిట్
మంకీపాక్స్ నిర్ధరాణ కోసం విశాఖ మెడిటెక్తొలి ఆర్టీపీసీఆర్కిట్ను రూపొందించింది. ఈ కిట్‌కు ఐసీఎంఆర్, సీడీఎస్‌సీవో నుంచి అత్యవసర అనుమతి కూడా లభించింది. కరోనా సమయంలో అనేక దేశీయ ఆరోగ్య సంబధింత ఉత్పత్తులను అందించిన మెడ్‌టెక్ జోన్ తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తొలి ఆర్టీపీసీఆర్ కిట్‌ను ఉత్పత్తి చేయడంతో రాష్ట్రానికి ఓ మంచి గుర్తింపు వచ్చినట్లయింది. గత శనివారం ఈ కిట్‌ను ఆవిష్కరించారు.