TataNagar Express : ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం

విశాఖ పెందుర్తిలో రైల్వే ట్రాక్‌పై విద్యుత్ స్తంభం పడగా టాటానగర్ ఎక్స్ప్రెస్‌ ముందే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ముగ్గురు గాయపడ్డారు.

TataNagar Express

అమరావతి : విశాఖ జిల్లా పెందుర్తిలో పెను రైలు ప్రమాదం తప్పింది.  రైల్వే ట్రాక్పై విద్యుత్ స్తంభం పడింది. అదే సమయంలో టాటానగర్ ఎక్స్ప్రెస్ అటుగా వస్తోంది. పెందుర్తిలో రైల్వే ట్రాక్‌ పనులు జరుగుతుండగా విద్యుత్‌ స్తంభం పక్కకు ఒరిగింది. అదే సమయంలో ఆ మార్గంలో టాటానగర్ ఎక్స్ ప్రెస్ రైలు వస్తుంది. దీనిని గమనించిన లోకోపైలెట్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే రైల్వే విద్యుత్‌ వైర్లపై స్తంభం పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Latest News