Manya Anand : ధనుష్ మేనేజర్ పై నటి మాన్య ఆనంద్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు

తమిళ నటి మాన్య ఆనంద్, హీరో ధనుష్ మేనేజర్ శ్రేయాస్‌పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. సినిమా కోసం కమిట్‌మెంట్ అడిగాడంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Manya Anand

విధాత, హైదరాబాద్: తమిళ సినీ హీరో ధనుష్ మేనేజర్‌ శ్రేయాస్‌పై తమిళ టీవీ నటి మాన్య ఆనంద్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సినిమా అవకాశం కోసం ధనుష్ మేనేజర్ శ్రేయాస్‌ కమిట్‌మెంట్ ఇవ్వాలని అడిగాడని మాన్య తీవ్ర ఆరోపణలు చేసింది. ధనుష్ పేరు చెప్పి కూడా తనపై ఒత్తిడి చేశాడని మాన్య ఆరోపించింది. ఇండస్ట్రీలో ఈ దుర్మార్గపు పద్ధతికి ముగింపు పలకాలని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రేయాస్ ఓ కొత్త సినిమా గురించి తనను సంప్రదించారని, కమిట్‌మెంట్ ఇవ్వాలని అడిగారని మాన్య పేర్కొంది. ఎలాంటి కమిట్‌మెంట్? నేను ఎందుకు కమిట్‌మెంట్ ఇవ్వాలి అని ప్రశ్నించానని మాన్య వెల్లడించారు. సినిమా కోసం షరతులు అంగీకరించడానికి నేను సిద్ధంగా లేనని చెప్పానని, ధనుష్ సర్ అడిగినా మీరు అంగీకరించరా? అని అడిగాడని మాన్య తెలిపింది.

శ్రేయాస్ నాకు చాలాసార్లు ఫోన్ చేసి ధనుష్ నిర్మాణ సంస్థ వుండర్‌బార్ ఫిల్మ్స్ లొకేషన్ పంపాడని, శ్రేయాస్ పదే పదే తనను సంప్రదించేవాడని, తాను సినిమా తిరస్కరించినప్పటికీ స్క్రిప్ట్‌లు పంపేవాడని మాన్య తెలిపారు. నేను స్క్రిప్ట్ చదవలేదు, ఈ సినిమా చేయడం లేదని చెప్పిన వినిపించుకోలేదని మాన్య ఆరోపించారు. మేము నటులం, నటించడం మా పని. మాకు అవకాశాలు ఇవ్వండి కానీ.. ప్రతిఫలంగా ఏమీ ఆశించకండంటూ మాన్య తెలిపారు. సినీ ఇండస్ట్రీలోనటి మాన్య చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే మాన్య ఆరోపణలపై ధనుష్ టీమ్ ఇంకా స్పందించలేదు.

Latest News