Site icon vidhaatha

టీడీపీ పొలిట్ బ్యూరో కొల్లు రవీంద్ర హౌస్ అరెస్ట్

విధాత‌:రేపు కొండపల్లిలో అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లనున్న టీడీపీ నిజనిర్థారణ కమిటీ దీంతో రేపు కొండపల్లి వెళ్లకుండా కొల్లు రవీంద్ర ను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు.మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్ పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన చేస్తున్నారు.కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరగకపోతే ఎందుకు టీడీపీ నేతల పర్యటనను అడ్డుకుంటున్నారని ప్ర‌శ్నించారు.కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరుగుతుంది అది బయటపడుతుందనే మాజీ మంత్రి దేవినేని ఉమాపై దాడికి దిగారు.దేవినేని ఉమా కారుపై వైసీపీ నాయకులు దాడి చేస్తే తిరిగి దేవినేని ఉమాపై కేసు పెట్టడం ఏంటి,ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కి మైనింగ్ చేసే అవసరం లేదని చిలకపలుకులు పలికిన మంత్రులు మా హౌస్ అరెస్ట్ కి ఏం సమాధానం చెబుతారు ?.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టీడీపీ నాయకుల మైనింగ్ పరిశీలనకు అంగీకరించాలి,పోలీసులను ఉపయోగించి ప్రశ్నించే గొంతును నొక్కలని చూస్తున్నారు.పోలీసులు ఎన్ని నిర్బందాలు పెట్టినా రేపు కొండపల్లి మైనింగ్ ప్రాంతానికి వెళ్లి తిరుతాం.

Exit mobile version