Site icon vidhaatha

వారం గడిచినా దొరకని బాలిక ఆచుకీ … పోలీసులకు సవాల్‌గామారిన ముచ్చుమర్రి ఘటన

విధాత, హైదరాబాద్ : ఏపీలోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో అత్యాచారం..హత్యకు గురైన ఎనిమిదేళ్ల బాలిక ఆచూకీ ఏడవ రోజు కూడా లభ్యం కాలేదు. ఈ నెల 7వ తేదీన ముగ్గురు మైనర్లు బాలికపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసి కాలువలో పడేశారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితులైన ముగ్గురు మైనర్లు చెప్పిన వివరాల ప్రకారం సమీప ముచ్చుమర్రి హంద్రీనీవా ఎత్తిపోతల కాలువలో గాలింపు చేపట్టినప్పటికి వారం రోజులుగా బాలిక ఆచూకి లభించ లేదు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్ సిబ్బంది , గజ ఈతగాళ్లతో గాలించినప్పటికి ఫలితం లేకపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. నిందితులు బాలిక మృతదేహాన్ని ఎక్కడ పడేశారన్న దానిపై మధ్యలో మాటమార్చి పూడ్చిపెట్టామని చెప్పగా, వారు చెప్పిన చోట త్రవ్వి చూసిన మృతదేహం జాడ దొరకలేదు. మళ్లీ కాలువలోనే పడేశామని చెప్పడంతో కాలువలో గాలింపు కొనసాగిస్తున్నారు. పోలీసుశాఖకు, ప్రభుత్వానికి బాలిక ఆచూకీ వ్యవహారం సవాల్‌గా మారడంతో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం సమీక్ష నిర్వహించారు. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.

Exit mobile version