విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ (ప్రజా వ్యవహారాలు) సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం ఈనెల 18వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. అలాగే ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం పదవీ కాలం ఈ నెల 4వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది.
ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్ పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగుస్తోంది. అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వ సలహాదారు (కో–ఆర్డినేటర్–కార్యక్రమాలు) తలశిల రఘురాం పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని అప్పటి నుంచి మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది.