విధాత: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారిని సూర్యప్రభ వాహనం బద్రి నారాయణుడి అలంకారంలో తిరుమాఢ వీధులలో విహరింపచేశారు. భక్తులు సప్తరథాశ్వాల సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు భక్తీ పారవశ్యంతో పులకించారు. రాత్రి స్వామివారిని చంద్రప్రభ వాహనం ఊరేగించారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ నిర్వహిస్తారు. గురువారం ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.