Site icon vidhaatha

హిందువుల పండుగలపైనే ఆంక్షలెందుకు?: సోము వీర్రాజు

విధాత,కర్నూలు: వినాయకచవితిని ఇళ్లలోనే జరుపుకోవాలంటూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందువుల పండుగలపైనే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని సోము వీర్రాజు ప్రశ్నించారు. కొవిడ్‌ నిబంధనలతో వినాయకచవితి జరుపుకొనేందుకు అనుమతించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బయటకొస్తే అరెస్ట్‌ చేస్తామని ఎలా అంటారని ప్రశ్నించారు. ఒక వర్గానికి సంబంధించే మీ ప్రభుత్వం ఉంటుందా? అని నిలదీశారు. రాష్ట్రంలో సంక్షేమం పేరుతో అభివృద్ధిని పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.

Exit mobile version