Site icon vidhaatha

Tirupati laddu | అస‌లు ల‌డ్డూల‌లో ఆ నెయ్యి వాడ‌నేలేదు..టిటిడి ఈవో శ్యామ‌ల‌రావు సంచ‌ల‌న ప్రక‌ట‌న‌

గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల(Thirumala) శ్రీనివాసుడి భక్తులు లడ్డూ(Laddu) విషయమై తల్లడిల్లిపోతున్నారు. కారణం, స్వయానా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, అందులో జంతువుల కొవ్వు(Animal Fats), చేపనూనె(Fish Oil) లాంటి ఘోర పదార్థాలను కలిపారని తమ టిడిఎల్​పీ సమావేశంలో చాలా మామూలుగా చెప్పారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటానుకోట్ల మంది భక్తులు ఉలిక్కిపడ్డారు. ఇది నిజమా? కాదా? అనే విషయం ఆలోచించేంత తార్కికత్వం అందరిలో మూగబోయింది. జరిగింది మహాపరాధం, మహా ఘోరం అనే భావనతో వణికిపోయారు. చంద్రబాబు ఈ విషయం చెప్పిన వెంటనే టిటిడి ఈవో (TTD EO) కొత్తగా వచ్చిన శ్యామల రావు(Shyamala Rao) ఈ విషయాన్ని ధృవీకరించారు. జులై 17న పరీక్షకు పంపితే, 23న నివేదిక వచ్చిందని, అందులో శాఖాహార నూనెలతో పాటు, జంతువుల కొవ్వుతో తయారుచేసిన నూనె, చేప నూనె ఉన్నట్లు తెలిపారు. ఇది తమిళనాడులోని ఏఆర్​ ఫుడ్స్​ సరఫరా చేసిన నెయ్యి అనీ, కిలో 360 రూ.లకు టిటిడీ కొన్నదని స్పష్టం చేసారు. కానీ, ఈ నెయ్యి శ్రీవారి పోటు(ప్రసాదాలు తయారుచేసే వంటశాల)కు చేరిందా? లేదా? దాన్ని ప్రసాదాలలో ముఖ్యంగా లడ్డూల తయారీలో వాడారా? లేదా? అనేది ఆయన చెప్పలేదు.

ఇక ఈ విషయానికి సాధ్యమైనంత పబ్లిసిటీ(Wide Publicity) కల్పించడంతో తెలుగుదేశం ప్రభుత్వం విజయం సాధించింది. సాక్షాత్తు వేంకటేశ్వరస్వామే తనతో ఈ విషయాన్ని చెప్పించాడని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. ఇక ఉప ముఖ్యమంత్రి (DCM Pawan Kalyan) ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు.

కానీ ఇప్పుడు ఈ ఆరోపణ నిజమా? కాదా? అనేది పరీక్షకు నిలిచింది(Chadrababu’s Tirupati laddu claim under scrutiny). ఇదే ఈవో శ్యామలరావు ఈనెల 21న “ది ప్రింట్”(The Print – www.theprint.in)​, ప్రఖ్యాత ఆంగ్ల వార్తా వెబ్​సైట్​తో మాట్లాడుతూ, అసలు ఆ నెయ్యి ఎక్కడా వాడనేలేదని(Adulterated Ghee never used) కుండ బద్దలు కొట్టారు. మొత్తం ఏఆర్​ డెయిరీ(AR Dairy) నుండి వచ్చిన పది ట్యాంకర్లలో, నాలుగింటిలో ఉన్న నెయ్యి నాణ్యతపై టిటిడి ‘నిపుణులు’ సందేహం వ్యక్తం చేసినట్లు, వెంటనే ఆ నాలుగు ట్యాంకర్లు పక్కన పెట్టించి వాటిలో నుండి సాంపిల్స్​ సేకరించి గుజరాత్​ డెయిరీ డెవెలప్​మెంట్​ బోర్డు(GDDB) అధ్వర్యంలోని కాఫ్​(CALF) సెంటర్​కు కల్తీ పరీక్షలకు పంపినట్లు తెలిపారు.

వందకు వంద శాతం నెయ్యిని మేము ఎక్కడా వాడలేదని టిటిడి ఈవో శ్యామలరావు మరోసారి ‘ది ప్రింట్’​కు స్పష్టం చేసారు.( “That ghee was never used, 100 percent,” Syamala told ThePrint Saturday.)

మరి వాడని నెయ్యికి, చేయని లడ్డూకి ఇంత పబ్లిసిటీ చేసి, మిలియన్ల భక్తజన మనోభావాలతో ఎందుకు ఆడుకున్నారనేది ఇక్కడ ప్రశ్న. వారికేవైనా రాజకీయాలుంటే, వేరే చోట చేసుకోవచ్చు. కానీ ఇది అత్యంత సున్నితమైన అంశం. ‘అయ్యో.. జంతువుల అవశేషాలతో అపవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని తిన్నామా’ అని విలవిలలాడుతున్న భక్తులకు ముఖ్యమంత్రి ఇచ్చే సమాధానమేమిటి?

 

జులై23న వచ్చిన నివేదికను సెప్టెంబర్​ 18 దాకా ఎందుకు దాచిపెట్టారు? ఒకవేళ నిజంగా జరిగినా కూడా, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని దీనిపై రాద్ధాంతం చేయకుండా దోషులెవరో కనుక్కుని శిక్షించాల్సింది. నిజంగా చెప్పాల్సివచ్చినా, కల్తీ జరిగిందనీ, దాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నామని చెప్పాల్సింది పోయి, భక్తులు తీవ్రంగా నలిగిపోయే స్థాయికి అసత్యాలు చెప్పారు.  ఇప్పుడు “కోటిసార్లు లడ్డూ బాగుంది, నాణ్యతను పునరుద్ధరించామ”ని మొత్తుకున్నా, భక్తజనంలో ఆ అపరాధ భావన తొలగిపోదు. ప్రతీ లడ్డూను అనుమానంగానే చూస్తారు. తప్పుచేసిన వారిని ఆ శ్రీవారే శిక్షిస్తారని ఉటంకించిన చంద్రబాబు… భక్తులను మోసం చేస్తే, వారి మనోభావాలను దెబ్బతీస్తే ఆ దేవదేవుడు  ఏం శిక్ష విధిస్తాడో ఇంకా చెప్పలేదు.

 

ది ప్రింట్​ శ్యామలరావుతో మాట్లాడిన వార్త ఈ కింది లింక్​లో చూడొచ్చు.

 

Naidu’s Tirupati laddu claim under scrutiny. ‘Adulterated ghee arrived in July, never used,’ says TTD (theprint.in)

Exit mobile version