ఏపీ లో మహిళల పై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యల పై జాతీయ మహిళా కమీషన్ కు లేఖ రాసిన తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత
విధాత:గత రెండేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలు నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నాయి.
- దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్లు, దిశా మొబైల్ వెహికల్స్, దిశా యాప్ ల ప్రచారం ఆంధ్రప్రదేశ్ ప్రజలను భ్రమలో పడేస్తున్నాయి.
- 19 జూన్ 2021 (శనివారం) నాడు కృష్ణ నది ఒడ్డున ఉన్న సీతానగరం పుష్కర్ ఘాట్ వద్ద మహిళ వేధింపులకు గురవ్వడం ఒక దురదృష్టకర సంఘటన.
- సంఘటన జరిగిన ప్రదేశం ముఖ్యమంత్రి నివాసంకు, డిజిపి, స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూతవేటు దూరంలోనే ఉంది.
- 22 జూన్ 2021 (మంగళవారం) దళిత మహిళ మల్లాది మరియమ్మ మధ్యాహ్నం 3 గంటలకు కొబ్బరి పొలాలకు వెళ్ళారు.
- సాయంత్రం 6 గంటలకు ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.
- మరియమ్మను చాలా కాలం క్రితం తన భర్త వదిపెట్టినా తన కుమార్తెకు ఒంటరిగా పెంచి వివాహం చేసింది.
ఈ సంఘటన కృష్ణ జిల్లా, మైలావరం మండలంలోని తోలుకోడు గ్రామంలో జరిగింది. - ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వం మహిళల రక్షణ కోసం చేస్తుంది సున్నా.
- ప్రభుత్వం చేసినదల్లా దిశా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, దిశా మొబైల్ వెహికల్స్ పేరిట వైసీపీ రంగులు వేసుకోవడమే.
- ఇప్పుడున్న చట్టాలను సరిగా అమలు చేస్తే మహిళా రక్షణ కు ఎటువంటి డోకా ఉండదు.
- ఏపీ లో మహిళల పై జరుగున్న దాడుల గురించి తెలుసుకోవాలని కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నాను.
- ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న దాడులు పై విచారణ చేసేందుకు ఒక బృందాన్ని రాష్ట్రానికి పంపండి.
- కమిషన్ తక్షణ చర్యలు మహిళల్లో విశ్వాసాన్ని కలిగించడమే కాక, ఆంధ్రప్రదేశ్లో మహిళలపై దాడులను అరికట్టడంలో కూడా సహాయపడుతుంది.