విధాత: టీడీపీ హయాంలో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశామని.. 20 ఏళ్ల క్రితం డ్వాక్రా గ్రూపులను చంద్రబాబు ఏర్పాటు చేశారని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. డ్వాక్రా గ్రూపులను ఈ ప్రభుత్వం నిర్విర్యం చేస్తోందని విమర్శించారు. మహిళా డబ్బులతో కూడా జగన్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు దాచుకున్న డబ్బును వాడుకోవడానికి ప్రభుత్వానికి ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. జగనన్న ఆసరా కాదు..జగనన్న దోపిడీ అమలు చేస్తున్నారని అనిత మండిపడ్డారు. రాజప్రసాదం నుండి చిలక బయటకి వచ్చిందని.. సీఎం జగన్ చిలక పలుకులు పలుకుతున్నారని యెద్దేవా చేశారు. మహిళా సాధికారతపైన సీఎం జగన్‌కు చిత్త శుద్ది లేదన్నారు. 45 ఏళ్ల మహిళలకు పెన్షన్ ఇస్తానని చెప్పిన మాటలు ఏమైపోయాయని ప్రశ్నించారు. పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీలను జగన్ విస్మరించారని అన్నారు. 98 లక్షల డ్వాక్రా మహిళలు రాష్ట్రంలో ఉంటే..72 లక్షల మందికి అసరా పథకం ఇస్తున్నారని తెలిపారు. అమ్మవడి డబ్బులు..నాన్నబుడ్డీ పేరుతో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో కరెంట్ బిల్ పట్టుకున్న షాక్ కొడుతోందన్నారు. ఫ్యాన్‌కి ఓటు వేసిన పాపానికి , ప్రజలు ఫ్యాన్ క్రింద కూడా కూర్చోలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. అన్నిటి ధరలను పెంచి ప్రభుత్వం ఒక చేత్తో ఇస్తూ..మరో చేత్తో దోపిడీ చేస్తున్నారని అనిత దుయ్యబట్టారు.
డ్వాక్రా గ్రూపులను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
<p>విధాత: టీడీపీ హయాంలో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశామని.. 20 ఏళ్ల క్రితం డ్వాక్రా గ్రూపులను చంద్రబాబు ఏర్పాటు చేశారని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. డ్వాక్రా గ్రూపులను ఈ ప్రభుత్వం నిర్విర్యం చేస్తోందని విమర్శించారు. మహిళా డబ్బులతో కూడా జగన్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు దాచుకున్న డబ్బును వాడుకోవడానికి ప్రభుత్వానికి ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. జగనన్న ఆసరా కాదు..జగనన్న దోపిడీ అమలు చేస్తున్నారని అనిత మండిపడ్డారు. రాజప్రసాదం నుండి […]</p>
Latest News

ఆట పాటల్లో ఇండిగో సిబ్బంది వీడియో వైరల్
‘అఖండ 2’ విడుదల తేదిపై క్లారిటీ…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ నాగార్జున సాగర్
అద్భుత లింగాభిషేకం..ద్రోణేశ్వర్ మహాదేవ్ తీర్థస్థలం
త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా తెలంగాణ పురోగమనం: గవర్నర్ జిష్ణుదేవ్
వరల్డ్ వండర్...సౌదీ అరేబియా స్కై స్టేడియం
ఏఐతో అకిరా హీరోగా సినిమా…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రోబో
రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం: నాగార్జున