Site icon vidhaatha

AP CM Jagan | మంచి భవిష్యత్తు కోసం సుపరిపాలనకే ఓటేయండి : ఏపీ సీఎం జగన్‌

AP CM Jagan : మంచి భవిష్యత్తు కోసం జనం సుపరిపాలనకే ఓటు వేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఇవాళ కడప లోక్‌సభ నియోజకవర్గంలోని జయమహల్ అంగన్‌వాడీ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘మీరు గత ఐదేళ్లు రాష్ట్రంలో పరిపాలనను చూశారు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం మీకు ఎన్ని ప్రయోజనాలు కల్పించిందో ఆలోచించండి. మంచి భవిష్యత్తు కోసం, ఈ ఐదేళ్ల సుపరిపాలనకే ఓటేయండి’ అని జగన్‌ పిలుపునిచ్చారు. అయితే ఎన్నికల కోడ్‌ ఉండగా ‘ఓటు వేయండి’ అని పిలుపునివ్వడం ఉల్లంఘన కిందకు వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు.

కాగా, కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ అవినాశ్‌ రెడ్డినే మళ్లీ బరిలో దింపింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ శర్మిల పోటీ చేస్తున్నారు. టీడీపీ చడిపిరాళ్ల భూపేశ్‌ సుబ్బరామిరెడ్డిని రంగంలోకి దించింది.

Exit mobile version