Site icon vidhaatha

AP CM Chandrababu | ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : ఏపీ సీఎం చంద్రబాబు

విధాత, హైదరాబాద్‌ : ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలపారు. కర్నూలు జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన ‘మన నీరు-మన సంపద’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుప్రీం తీర్పుపై స్పందించారు. 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ పై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి….సామాజిక న్యాయం గెలవాలి అనేదే తెలుగుదేశం సిద్ధాంతమన్నారు. . అత్యంత నిరుపేదలకు ఫలాలు అందించేందుకు వర్గీకరణ ఉపయోగపడుతుందని, దళితులు ఐక్యంగా ఉండి…అభివృద్ధి సాధించాలని, ఆర్థికంగా, సామాజికంగా వారి జీవితాల్లో వెలుగులు రావాలన్నారు. సామాజిక న్యాయం, దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయడం లక్ష్యంతో గతంలో వర్గీకరణకు సంబంధించి ఏబీసీడీలుగా కేటగిరీ తీసుకొచ్చానన్నారు. అందరికీ న్యాయం జరగాలని, ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా అలాగే చేశామని, ఈ ప్రభుత్వం అందరిది.. మీ అందరివాడిగా ఉంటానని చంద్రబాబు తెలిపారు.

Exit mobile version