Site icon vidhaatha

MANDA KRISHANA | సీఎం రేవంత్‌రెడ్డితో మంద కృష్ణ భేటీ

వర్గీకరణ సుప్రీం తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను కలిశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి మంద కృష్ణ మాదిగా విజ్ఞప్తి చేశారు.
మందకృష్ణతో పాటు సీఎంని కలిసిన వారిలో మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ తదితరులు ఉన్నారు. మందకృష్ణతో భేటీ ఫోటోలను ట్విటర్ ఎక్స్ వేదికగా పోస్టు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలిశారని, ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు తీర్పు అమలుపై భేటీలో చర్చించామని తెలిపారు.

Exit mobile version