అమరావతి : సముద్రం అంటేనే అనేక జీవరాశుల ఆవాసం. అగాధ జలనిధిలో సహజ వనరులే కాదు..అబ్బుర పరిచే జీవరాశుల ఉనికి కూడా మానవ ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు అబ్బుర పరుస్తుంటుంది. తాజాగా ఏపీలోని విశాఖ పట్నం రుషికొండ బీచ్ సమీపంలో సముద్రంలో ఓ భారీ తిమింగలం సంచారం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రుషికొండ సముద్ర తీరం పరిసరాల్లో స్కూబా డైవింగ్ బృందానికి ఓ పెద్ద వేల్ షార్క్ జాతి తిమింగలం కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన స్కూబా డైవింగ్ బృందం సముద్ర జలాల లోపల ఆ భారీ తిమింగలం సంచారాన్ని డైవింగ్ చేస్తూ వీడియో చిత్రికరించారు. సముద్ర తీరం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ 40 అడుగుల లోతున నలుగురు స్కూబా డైవింగ్ చేస్తుండగా ఇది కనిపించినట్లు ఏపీ వాటర్ స్పోర్ట్స్ అధ్యక్షుడు బి.బలరామ్‌నాయుడు పేర్కొన్నారు. ఆ సమయంలో తీసిన వీడియోను వారు విడుదల చేశారు.
విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో బోట్ షికార్, స్కూబా డైవింగ్ పర్యాటకులను అలరిస్తున్నాయి. తాజాగా మరింత మధురాభూతిని కలిగించేందుకు లివిన్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో పారా గ్లైడింగ్ కూడా పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. 300–500 మీటర్లు ఎత్తులో పారా గ్లైడింగ్ వెళ్లి సరికొత్త అనుభూతిని పొందొచ్చు. మరోవైపు విశాఖపట్నంలో కీలకమైన పర్యాటక మణిహారమైన కైలాసగిరిపై.. రాష్ట్రంలోనే మొదటిసారి ఏర్పాటు చేసిన అడ్వెంచర్ స్పోర్ట్స్ జోన్ కూడా ఇటీవల ప్రారంభమైంది. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన జిప్ లైనర్, స్కై సైక్లింగ్‌ను ఇటీవల అందుబాటులోకి తేవడంతో ఆయా పర్యాటక స్థలాలకు సందర్శకులు తాకిడి పెరిగింది.
రుషికొండ సముద్రంలో అబ్బురుపరిచే దృశ్యం..
స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రత్యేక్షమైన భారీ తిమింగలం..
డైవింగ్ చేస్తూ వీడియో చిత్రకరించిన డైవర్స్ pic.twitter.com/c8TtyHoe1d
— Telugu Reporter (@TeluguReporter_) January 22, 2026
ఇవి కూడా చదవండి :
Pawan Kalyan | కోటప్పకొండలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన .. ప్రత్యేక పూజలు చేసిన డిప్యూటీ సీఎం
CRPF Officer Simran Bala | మరో చరిత్ర సృష్టించబోతున్న భారత నారీ..గణతంత్ర వేడుకలే వేదిక!
