Beauty tips | వీటిని కొబ్బరి నూనెతో కలిపి పెట్టుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!

Beauty tips : జుట్టు ఒత్తుగా ఉంటేనే ఎవరైనా అందంగా కనిపిస్తారు. జుట్టు నెరిసినా, రాలిపోయినా ముఖం కళ తప్పుతుంది. ఇది చాలామందిని ఆందోళనకు గురిచేస్తుంటుంది. ముఖ్యంగా యువతను ఈ సమస్య బాగా ఆందోళనకు గురిచేస్తుంది. జుట్టు ఒత్తుగా ఉంటే రకరకాల హెయిర్‌ స్టైల్స్‌ మెయింటెయిన్‌ చేయవచ్చు, చూసే అందంగా కనిపించవచ్చు అని యువత భావిస్తారు.

  • Publish Date - June 21, 2024 / 07:00 PM IST

Beauty tips : జుట్టు ఒత్తుగా ఉంటేనే ఎవరైనా అందంగా కనిపిస్తారు. జుట్టు నెరిసినా, రాలిపోయినా ముఖం కళ తప్పుతుంది. ఇది చాలామందిని ఆందోళనకు గురిచేస్తుంటుంది. ముఖ్యంగా యువతను ఈ సమస్య బాగా ఆందోళనకు గురిచేస్తుంది. జుట్టు ఒత్తుగా ఉంటే రకరకాల హెయిర్‌ స్టైల్స్‌ మెయింటెయిన్‌ చేయవచ్చు, చూసే అందంగా కనిపించవచ్చు అని యువత భావిస్తారు. జుట్టు ఒత్తుగా లేకపోతే ఆ లోపాన్ని సరిదిద్దుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా పరిష్కారం లభించక బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని చిట్కాల ద్వారా తమ జుట్టును ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

కొన్ని రకాల ఆకులను కొబ్బరి నూనెతో కలిపి తలకు రాసుకుంటే అద్భుత ప్రయోజనాలున్నాయి. అయితే ఇవి సహజ పద్ధతిలో జుట్టును పెంచుతాయి కాబట్టి వెంటనే ఫలితం కనిపించదు. ఫలితం కొన్నాళ్లు ఓపిక పట్టాల్సి ఉంటుంది. వెంటనే ఫలితం రాలేదని ప్రయత్నాన్ని మానుకుంటే ఎప్పటికీ ప్రయోజనం ఉండదు. ఆలస్యమైనా సహజ చిట్కాలే మంచిది. పార్లర్స్‌లో కెమికల్స్‌తో చేసే చికిత్సలకు దూరంగా ఉండాలి. సహజ సిద్ధంగా లభ్యమయ్యే పత్రాలతో జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసుకునేందుకు పాటించాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయి.

కరివేపాకులు

కరివేపాకును మెత్తగా రుబ్బి పేస్టులా చేసుకోవాలి. దాన్ని కొబ్బరినూనెలో వేసి మరిగించాలి. తర్వాత దాన్ని చల్లబరిచి తలకు పట్టించాలి. నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఒక గంటసేపు అలా వదిలేసి తర్వాత తేలికపాటి షాంపూతో స్నానం చేయాలి. కరివేపాకుతో హెయిర్ మాస్క్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల కూడా జుట్టు పెరుగుతుంది.

మందార ఆకులు

మందార ఆకులను పేస్టులా చేసి జుట్టుకు పట్టించాలి. దీనివల్ల వెంట్రుకలు మృదువుగా ఒత్తుగా మారతాయి. మందార ఆకులను గోరింట ఆకులతో కలిపి రుబ్బుకుంటే ఫలితం ఇంకా బాగుంటుంది. వాటికి వేప ఆకులను కూడా జోడిస్తే తలలో దురద తగ్గుతుంది. అదేవిధంగా మందార, గోరింట, వేప ఆకులను రుబ్బుకుని, వాటికి పెరుగును కూడా కలుపుకోవాలి. ఆ పేస్టును తలకు పూర్తిగా పట్టించి గంటసేపు అలా వదిలేయాలి. అనంతరం తలస్నానం చేయాలి. ఇది జుట్టు ఒత్తుగా పెరగడానికి తోడ్పడుతుంది.

Latest News