Site icon vidhaatha

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీ ఎమ్మెల్యే బంధువులు ఆరుగురు మృతి

అమలాపురం: అమెరికాలోని టెక్సాస్‌లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీశ్‌కుమార్‌ బంధువులు ఆరుగురు చనిపోయారు. మృతులను పీ నాగేశ్వర్‌రావు, సీతా మహాలక్ష్మి, నవీన, కృతిక్‌, నిశిష్ఠ, మరొకరు ఉన్నారు. మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్న కారు.. 67వ నంబర్‌ రహదారిపై వెళుతున్న కారును ఎదురుగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన నాగేశ్వర్‌రావు అల్లుడు లోకేశ్‌ను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.


ఈ ఘటనలో ట్రక్కులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని, వారికి హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారని అమెరికన్‌ మీడియా పేర్కొన్నది. ట్రక్కు డ్రైవర్‌ పొరపాటు వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నదని పోలీసు అధికారులు చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి. ‘మా బాబాయి, పిన్ని, వారి కుమార్తె, ఇద్దరు మనుమలు, మనుమరాండ్రు, మరో బంధువు ఈ ప్రమాదంలో చనిపోయారు’ అని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ తెలిపారు. 17 ఏళ్ల అమెరికన్‌ బాలుడు ట్రక్కుతో వచ్చి కారును ఢీకొన్నాడని పేర్కొన్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్రిస్మస్‌ సెలవుల సందర్భంగా వారంతా మరో బంధువు అయిన విశాల్‌ ఇంటికి వెళుతుండగా జాన్సన్‌ కౌంటీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని ఎమ్మెల్యే చెప్పారు. జార్జియా స్టేట్‌ నుంచి అట్లాంటా వెళుతున్నారని, మార్గమధ్యంలో ఒక జూపార్క్‌ వద్ద ఆగి, తిరిగి బయలుదేరిన సమయంలో ఈ విషాదం చోటు చేసుకున్నదని ఆయన తెలిపారు. మృతదేహాలను భారతదేశానికి తరలించేందుకు తానా నాయకులు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు.


ఈ ఘటనలో చనిపోయిన నాగేశ్వర్‌రావు.. తన తండ్రి సత్యారావు తమ్ముడని తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన నాగేశ్వర్‌రావు కుమార్తె అట్లాంటాలో నివసిస్తున్నదని చెప్పారు. అమలాపురానికి చెందిన నాగేశ్వర్‌రావు, సీతామహాలక్ష్మి దంపతులు తమ కుమార్తెను కలిసేందుకు రెండు నెలల క్రితమే అమెరికా వెళ్లారు.సాయంత్రం చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ముమ్మడివరం ఎమ్మెల్యే వెంకట సతీశ్‌కుమార్‌ బంధువులు ఆరుగురు చనిపోయారు. మృతులను పీ నాగేశ్వర్‌రావు, సీతా మహాలక్ష్మి, నవీన, కృతిక్‌, నిశిష్ఠ, మరొకరు ఉన్నారు. మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్న కారు.. 67వ నంబర్‌ రహదారిపై వెళుతున్న కారును ఒక ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.


ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన లోకేశ్‌ను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఘటనలో ట్రక్కులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని, వారికి హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారని అమెరికన్‌ మీడియా పేర్కొన్నది. ట్రక్కు డ్రైవర్‌ పొరపాటు వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నదని పోలీసు అధికారులు చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి. ‘మా బాబాయి, పిన్ని, వారి కుమార్తె, ఇద్దరు మనుమలు, మనుమరాండ్రు, మరో బంధువు ఈ ప్రమాదంలో చనిపోయారు’ అని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ తెలిపారు. 17 ఏళ్ల అమెరికన్‌ బాలుడు ట్రక్కుతో వచ్చి కారును ఢీకొన్నాడని పేర్కొన్నారు.


అమెరికా కాల మానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్రిస్మస్‌ సెలవుల సందర్భంగా వారంతా మరో బంధువు అయిన విశాల్‌ ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నదని ఎమ్మెల్యే చెప్పారు. జార్జియా స్టేట్‌ నుంచి అట్లాంటా వెళుతున్నారని, మార్గమధ్యంలో ఒక జూపార్క్‌ వద్ద ఆగి, తిరిగి బయలుదేరిన సమయంలో ఈ విషాదం చోటు చేసుకున్నదని ఆయన తెలిపారు. మృతదేహాలను భారతదేశానికి తరలించేందుకు తానా నాయకులు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ఘటనలో చనిపోయిన నాగేశ్వర్‌రావు.. తన తండ్రి సత్యారావు తమ్ముడని తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన నాగేశ్వర్‌రావు కుమార్తె అట్లాంటాలో నివసిస్తున్నదని చెప్పారు. రెండు నెలల క్రితమే నాగేశ్వర్‌రావు అమెరికా వెళ్లారు.

Exit mobile version