Site icon vidhaatha

Trisha Krishnan | బాలీవుడ్‌ సినిమాల్లో నటించకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!

Trisha Krishnan | త్రిష కృష్ణన్‌. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 2002లో సినీరంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. తనతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లంతా ఫేడవుట్‌ అయ్యారు. రెండు దశాబ్దాలుగా తన గ్లామర్‌తో, మరో వైపు నటనతో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నది. తన కెరియర్‌లో ఇప్పటి వరకు దాదాపు 65 సినిమాల్లో నటించిన త్రిష.. ఇక సినిమా మినహా మిగతావన్నీ సౌత్‌ ఇండస్ట్రీలోనే చేసిది. 20 ఏళ్ల కెరియర్‌లో కేవలం బాలీవుడ్‌లో ఒకే సినిమాలో నటించింది. 2010లో అక్షయ్‌ కుమార్‌తో ‘కట్టా మీటా’లో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయింది. ఇక ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్‌ వైపు మళ్లీ కన్నెత్తి చూడలేదు. అయితే, బాలీవుడ్‌ సినిమాల్లో మళ్లీ నటించకపోవడానికి అసలు కారణం బయటపెట్టింది. ఇప్పటి వరకు కట్టా మీటా సినిమా విజయం సాధించకపోవడంతో అవకాశాలు రాకనే హిందీ చిత్రాల్లో నటించలేదని అంతా అనుకున్నారు.

కానీ, దక్షిణాది చిత్రాల్లో ఎక్కువగా అవకాశాలు వచ్చేవని.. హిందీ ఆఫర్లు వచ్చిన సమయంలో వాటన్నింటినీ వదిలి వెళ్లాల్సి వస్తుందని.. ఆ చిత్రాలను వదులుకోలేక బాలీవుడ్‌ ఆఫర్లు తిరస్కరించినట్లు తెలిపింది. దక్షిణ చిత్రపరిశ్రమలో మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అక్కడికి మకాం మార్చి కొత్తగా కెరియర్‌ను ప్రారంభించే ఓపిక లేదని పేర్కొంది. 2019లో వచ్చిన పేట చిత్రం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నది. 2021లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదున్నది. పొన్నియన్‌ సెల్వన్‌ సిరీస్‌లో తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నది. చివరిసారిగా విజయ్‌ దళపతి సరసన ‘లియో’లో నటించింది. ప్రస్తుతం విదా ముయార్చి, రామ్‌, ఐడెంటిటీ, థగ్‌లైఫ్‌తో పాటు తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సరసన విశ్వంభరలో నటిస్తున్నది. అలాగే వెంకటేశ్‌ 76వ చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించనున్నది టాక్‌ నడుస్తున్నది.

Exit mobile version