Site icon vidhaatha

All Party Meeting On Delimitation: నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం

All Party Meeting On Delimitation:

లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) తో దక్షిణాది రాష్ట్రాలకు జరుగనున్న అన్యాయంపై కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డిలు సంయుక్తంగా బుధవారం బహిరంగ లేఖ విడుదల చేశారు.

జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని వారు పేర్కొన్నారు. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న అఖిల పక్ష సమావేశానికి అన్ని పార్టీలు హాజరుకావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిలు కోరారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని బహిరంగ లేఖలో తెలిపారు. త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామని బహిరంగ లేఖ ద్వారా వారు స్పష్టం చేశారు.

Exit mobile version