విధాత, హైదరాబాద్ : సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల కోసం తాజాగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారులతో సమానంగా కార్మికులకు సౌకర్యాలు, ఉద్యోగుల పేరు మార్పుల సమస్యకు పరిష్కారం, కార్మికుల సొంత ఇంటి కలను సాకారం చేస్తాం అని ఈ సందర్బంగా భట్టి వెల్లడించారు.
మెడికల్ ఇన్వాల్యుయేషన్ సంబంధించి వాళ్లకున్న జబ్బులకు సంబంధించి బోర్డు ఉన్న అన్ని విధాల పరిష్కారం చూపిస్తాం అని తెలిపారు. కోల్ ఇండియ నిబంధన మేరకు సింగరేణిలో అధికారుల సంబంధించిన అన్ని సౌకర్యాలను భరిస్తుందో అదేవిధంగా సింగరేణి కార్మికులకు కూడా అన్ని సౌకర్యాలు (టాక్స్) కల్పించడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందనీ ప్రకటనలో స్పష్టం చేశారు. సింగరేణి ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఐఫోర్ కమిటీ నిర్ణయించి సొంతింటి కల సహకారం చేస్తుందనీ తెలిపారు. సింగరేణి ఉద్యోగులందరికీ దేశంలో ఎక్కడా లేని రీతిలో 1.25 కోట్ల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు.
సింగరేణి ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన రూ.1.25 కోట్ల ప్రమాద బీమా పథకం దేశవ్యాప్తంగా ఒక నమూనా పథకంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల కోసం 40 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా పథకం అమలు చేయడం జరిగింది అని చెప్పారు. కారుణ్య నియామకాల్లో వారసుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. సింగరేణిలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2,539 పోస్టులను భర్తీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. వీటిలో 798 ఎక్స్ టర్నల్ పోస్టులు ఉండగా… 1,741 కారుణ్య నియామక ఉద్యోగాలను ఇవ్వడం జరిగిందనీ పేర్కొన్నారు. క్యాథ్ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా సింగరేణి ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చేందుకు చర్యలు తీసుకున్నాం అన్నారు. 2024-25 లో సింగరేణి చరిత్రలో అత్యధిక లాభాలు (రూ. 6,394 కోట్లు) సాధించాంఅని, అత్యధికంగా 34 శాతం లాభాల వాటా కింద 802 కోట్ల రూపాయలను కార్మికులకు చెల్లించడం జరిగిందని, పొరుగు సేవల సిబ్బందికి రూ.5,500 చొప్పున లాభాల వాటా చెల్లించడం జరిగిందని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Renault Duster comeback| రెనాల్ట్ డస్టర్ ఈజ్ బ్యాక్ .. లుక్, ఫీచర్స్ అదుర్స్
HYD to BNG – NH-44 | రూపుమారిన హైదరాబాద్-బెంగళూరు హైవే – గ్రీన్ఫీల్డ్ నుండి యాక్సెస్ కంట్రోల్డ్ : 5 గంటలే ప్రయాణం
