NPS New Rules | ఎన్‌పీఎస్ అకౌంట్ లాగిన్‌కు.. ఆధార్ అథెంటిఫికేష‌న్‌..!

  • Publish Date - March 30, 2024 / 06:50 AM IST

NPS New Rules | దేశంలోని పోస్టాఫీసులు, బ్యాంకుల్లో వివిధ ర‌కాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో కీల‌క‌మైంది నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్‌. ఈ ప‌థ‌కాన్ని మ‌రింత సెక్యూర్ చేసేందుకు పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రి డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. టూ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రాబోతున్న‌ది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇక మరింత భ‌ద్ర‌త క‌ల్పించేందుకు పథ‌కానికి టూ ఫ్యాక్టర్ ఆధార్ బేస్డ్ అథెంటిఫికేషన్ ప్రవేశపెడుతూ ఈ నెల 15న సర్క్యులర్ జారీ చేసింది. కొత్త సెక్యూరిటీ విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక నుంచి పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయ్యే స‌మ‌యంలో ఆధార్ అథెంటిఫికేషన్ సైతం ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో సీఆర్ఏ సిస్టమ్‌లో అనధికారిక యాక్సెస్ చాలావరకూ తగ్గిపోయే అవ‌కాశాలుంటాయి. ఈ సెక్యూరిటీ లేయర్ కారణంగా పెన్షన్ స్కీమ్ ఖాతాదారుల మరింత భద్రత కలుగనున్న‌ది. సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలో ప్రస్తుతం ఉన్న పాస్‌వర్డ్ ఆధారిత లాగిన్ ప్రాసెస్‌కు ఆధార్ ఆధారిత లాగిన్ అథెంటిఫికేషన్ తీసుకువ‌చ్చింది. ముందుగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ అధికారిక వెబ్‌సైట్ enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ విత్ PRAIN లేదంటే IPIN ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా నమోదు చేయాలి ఉంటుంది. ఆ త‌ర్వాత ఆధార్ అథెంటిఫికేషన్ విండో ఓపెన్ అవుతుంది. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంట‌ర్ చేసి ధ్రువీక‌రించాలి. దాంతో ఎన్‌పీఎస్ ఖాతాకు యాక్సెస్ లభిస్తుంది.

Latest News