మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో టాప్ హీరోగా ఎదిగి మంచి పేరు ప్రఖ్యాతలు అందిపుచ్చుకున్నారు. ఆయనకి టాలీవుడ్‌లో చాలా మంది హీరోలతో స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. అయితే తాజాగా చిరంజీవి ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లని స్మరించుకుంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నేను కూడా సినిమాలలో కలిసి నటించడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు చిరంజీవి. ఇక ఎన్టీఆర్ తో కలిసి నటించిన సమయంలో ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు గురించి చెప్పారు. ఓ సందర్భంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇచ్చిన సలహాలను కూడా ఇచ్చారని చిరు అన్నారు. ” బ్రదర్.. మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు. మీరు సంపాదించిన సంపద అంతా ఇనుప ముక్కల మీద పెట్టకండి. ఏదైనా మంచి ఇళ్ళు కట్టుకోండి. తర్వాత ఏదైనా స్థలాలు కొనండి. ఎప్పటికైనా మనల్ని కాపాడేది అదే. మనం ఎక్కువ కాలం ఇదే సూపర్ స్టార్ డం తో ఉంటాము. ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి ” అంటూ అప్పటి వారి మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్పుకొచ్చాడు చిరు
ఎన్టీఆర్ చెప్పే వరకు తనకు కార్లు అంటే బాగా ఇష్టం ఉండడంతో… మార్కెట్ లోకి కొత్త కారు వస్తే ఎలాంటి కారు కొనాలి అని ఆలోచించే వాడిని. ఎన్టీఆర్ చెప్పిన తర్వాత ఆయన సలహాలు పాటించా. ఆ సలహాని నన్ను, నా కుటుంబాన్ని కాపాడింది అని చిరంజీవి పేర్కొన్నారు. ఇక యండమూరి వీరేంద్రనాథ్ పై కూడా ప్రశంసలు కురిపించారు చిరు. ఆయన సినిమాల్లో ఆయన పాత్ర ఎంతో ఉందని, ఆయన రాసిన పుస్తకాల ఆధారంగానే ఎన్నో సినిమాలు చేసినట్టు తెలిపారు. 80వ దశకంలో చాలా వరకు ఆయన రాసిన రచనలు, కథలు, పాత్రలు తనకు స్టార్ డమ్ రావడంలో కీలక పాత్ర పోషించినట్టు స్పష్టం చేశారు.
మెగాస్టార్ అనే పేరు రావడానికి కారణం కూడా ఆయనే అని చిరు అన్నారు. `అభిలాష` పుస్తకాన్ని తన అమ్మ ముందుగా చదివి చెప్పిందని, ఆ రెండు మూడు రోజులకే మద్రాస్‌లో అదే కథతో కేఎస్ రామారావు తనతో సినిమా చేసేందుకు వచ్చారని , అందులో హీరో పాత్ర కూడా చిరంజీవినే అని, అది కాకతాళియమో ఏమోగానీ, ఆ సినిమా నేను చేయడం అదృష్టంగా భావిస్తున్నా, ఆ సినిమా పెద్ద విజయం సాధించి తనలో నమ్మకాన్ని పెంచిందని, ఇక మనకు తిరుగులేదనే నమ్మకాన్ని ఇచ్చిందని చిరంజీవి తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.