Site icon vidhaatha

వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న గుజ‌రాత్ జెయింట్స్.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యం

ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ లో ఆదివారం గుజ‌రాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య పోరు హోరాహోరీగా సాగింది.మూడు మ్యాచ్‌లు ఓడిన గుజరాత్ జెయింట్స్ క‌నీసం నాలుగో మ్యాచ్‌లో అయిన విజ‌యం సాధిస్తుందా అని అంద‌రు ఆశ‌గా ఎదురు చూసారు. కాని ఆ మ్యాచ్‌లో ఓట‌మి పాలు కావ‌ల్సి వ‌చ్చింది . 25 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై ఓటమిపాలైంది ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టు. అయితే టోర్నీలో మూడో విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌.. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో నిలిచింది.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసింది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (55) హాఫ్ సెంచరీతో రాణించగా.. అలీస్‌ క్యాప్సీ (27) దూకుడుగా ఆడి జ‌ట్టుకి మంచి స్కోరు అందించింది. మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ ఎవ‌రు పెద్ద‌గా ప్ర‌తిఘ‌ట‌న చూపించ‌లేదు. లేదంటే ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్కోరు మ‌రింత పెరిగి ఉండేది. మ‌రో వైపు గుజ‌రాత్ జెయింట్స్ బౌల‌ర్స్ కూడా క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మేఘన సింగ్(4/37) నాలుగు వికెట్లు తీయగా.. అశ్లే గార్డ్‌నర్(2/37) రెండు వికెట్లు, మన్నత్ కశ్యప్, తనూజ కన్వర్ తలో వికెట్ తీసారు.ఇక 164 ప‌రుగుల ల‌క్ష్యంతో గుజ‌రాత్ జెయింట్స్ బరిలోకి దిగ‌గా, 20 ఓవ‌ర్లు ఆడిన ఆ టీం 8 వికెట్లు కోల్పోయి 138 ప‌రుగుల‌కి ఆలౌట్ అయింది.

గుజ‌రాత్ జెయింట్స్ జ‌ట్టులో అశ్లే గార్డ్‌నర్(40) ఒక్కతే రాణించగా.. మిగతా బ్యాటర్లు అంద‌రు దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. అన‌వ‌స‌ర‌పు షాట్స్ ఆడ‌డంతో త్వ‌ర‌త్వ‌ర‌గా వికెట్స్ కోల్పోవ‌ల‌సి వ‌చ్చింది. ఏ ఒక్క బ్యాట‌ర్ కూడా క్రీజులో నిల‌బ‌డి టార్గెట్ చేజ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు క‌నిపించ‌లేదు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్స్ క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.జెస్స్ జోనాస్సెన్(3/22), రాధా యాదవ్(3/20) మూడేసి వికెట్లు తీయగా.. శిఖా పాండే, అరుంధతి రెడ్డి తలో వికెట్ తీసారు. మ‌రి ఇప్ప‌టికే నాలుగు ప‌రాజ‌యాలు చ‌వి చూసిన గుజరాత్ జెయింట్స్ జ‌ట్టు దాదాపు టోర్నీ నుండి త‌ప్పుకున్న‌ట్టే అంటున్నారు.

Exit mobile version