Site icon vidhaatha

Rishabh Pant | రిషబ్‌ పంత్‌పై మ్యాచ్‌ నిషేధం ఛాన్స్‌..! ఐపీఎల్‌ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..?

Rishabh Pant | ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు శనివారం ముంబయితో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను పది పరుగుల తేడాతో మట్టికరిపించింది. చివరి ఓవర్‌ వరకు మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఐదో స్థానానికి చేరుకుంది. దీంతో ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా నిలుపుకున్నది. జట్టు విజయం నమోదు చేసిన కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు తిప్పలు తప్పేలా లేవు. పంత్‌పై ఐపీఎల్‌ ఒక మ్యాచ్‌ నిషేధం విధించే అవకాశాలున్నాయి.

కారణం ఏంటంటే.. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. ఢిల్లీ క్యాపిటిల్స్ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడం ఇది మూడోసారి. వాస్తవానికి ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం.. మూడుసార్లు స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్‌ చేస్తే జట్టు కెప్టెన్‌కు వందశాతం మ్యాచ్‌ ఫీజును జరిమానా విధించడంతో పాటు రిఫరీ విచక్షణ మేరకు మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ఢిల్లీ క్యాపిటల్స్‌ తర్వాత మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఢిల్లీ తర్వాత మ్యాచ్‌ కోల్‌కతాతో ఆడనున్నది. మరి ఈ మ్యాచ్‌కు రిషబ్‌ పంత్‌ అందుబాటులో ఉంటాడా? లేదా? త్వరలోనే తేలననున్నది.

Exit mobile version