Ants | చీమ‌లతో ఇబ్బంది ప‌డుతున్నారా..? ఈ చిట్కాల‌తో తొల‌గించండిలా..!

ప్ర‌తి ఇంట్లో చీమ‌లు ఉంటాయి. తియ్య‌టి ప‌దార్థాలు ఉన్న చోట చీమ‌లు గుంపులు గుంపులుగా ఉంటాయి. ఇత‌ర ప‌దార్థాల‌కు ఆ చీమ‌లు ప‌ట్టి.. ఆ ఇంటి గృహ‌ణికి ఇబ్బంది క‌లిగేలా వ్య‌వ‌హ‌రిస్తుంటాయి.

  • Publish Date - March 26, 2024 / 04:33 PM IST

ప్ర‌తి ఇంట్లో చీమ‌లు ఉంటాయి. తియ్య‌టి ప‌దార్థాలు ఉన్న చోట చీమ‌లు గుంపులు గుంపులుగా ఉంటాయి. ఇత‌ర ప‌దార్థాల‌కు ఆ చీమ‌లు ప‌ట్టి.. ఆ ఇంటి గృహ‌ణికి ఇబ్బంది క‌లిగేలా వ్య‌వ‌హ‌రిస్తుంటాయి. ఇక ఒక చోట నుంచి మ‌రో చోట‌కు చీమ‌లు దారులు క‌డుతాయి. ఇక వీటిని నిర్మూలించేందుకు గృహిణులు ర‌క‌ర‌కాల చిట్కాలు పాటిస్తుంటారు. ఈ చిట్కాల‌తో చీమ‌ల‌ను క‌నిపించ‌కుండా చేయొచ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏవో చూసేద్దామా..

సుద్ద ముక్క : ప్ర‌తి ఇంట్లో సుద్ద ముక్క ఉంటుంది. ఈ సుద్ద ముక్క‌లో కాల్షియం కార్బొనేట్ ఉంటుంది. దీంతో చీమ‌ల‌ను ఈ కాల్షియం కార్బొనేట్ నిరోధిస్తుంది. చీమ‌లు ఉన్న ప్రాంతాల్లో సుద్ద ముక్క పౌడ‌ర్‌ను చ‌ల్లిన కూడా చీమ‌లు మాయ‌మైపోతాయి. ఇత‌ర కీట‌కాల నిరోధానికి కూడా సుద్ద ముక్క‌ను ఉప‌యోగించొచ్చు.

నిమ్మ కాయ : ఇంట్లో చీమ‌లు ఉన్న ప్రాంతంలో నిమ్మ కాయ ముక్క‌ల‌ను ఉంచాలి. లేదంటే నిమ్మ ర‌సాన్ని పిండాలి. ఇంటి నిండా చీమ‌లు ఉన్నాయ‌నుకుంటే.. నీళ్లలో కొంచెం నిమ్మ‌ర‌సం క‌లిపి ఫ్లోర్ తుడిచినా చీమ‌లు క‌నిపించ‌వు. వంట గ‌ది ఫ్లోర్‌తో పాటు స్టౌ ఏరియాలో నిమ్మ తొక్క‌ల‌తో శుభ్రం చేస్తే చీమ‌లు మాయ‌మ‌వుతాయి.

మిరియాలు : మిరియాలు అంటే కూడా చీమ‌ల‌కు న‌చ్చ‌వు. ఆ వాస‌నే చీమ‌ల‌కు ప‌డ‌దు. చీమ‌లు ఇంట్లోకి ప్ర‌వేశించే ప్రాంతాన్ని గుర్తించి అక్క‌డ మిరియాల పొడి చ‌ల్లాలి. లేదా మిరియాల పొడిని నీళ్ల‌లో క‌లిపి ఆ ద్రావ‌ణాన్ని అక్క‌డ స్ప్రే చేసినా కూడా చీమ‌లు క‌నిపించ‌వు. మిరియాల ఘాటుకు చీమ‌లు చ‌నిపోవు కానీ.. ఆ వాస‌న‌కు దూరంగా ఉంటాయి.

దాల్చిన చెక్క‌, ల‌వంగాలు : ఇక చీమ‌లు ఉన్న చోట దాల్చిన చెక్క‌, ల‌వంగాల‌ను ఉంచినా కూడా అవి క‌నిపించ‌కుండా పోతాయి. ఎందుకంటే దాల్చిన చెక్క వాస‌న చీమ‌ల‌కు ప‌డ‌దు. దీంతో చీమ‌ల బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

ఉప్పు : ఇది త‌క్కువ ధ‌ర‌కే ల‌భించ‌నుంది. ఇక చీమ‌లు తిరిగే ప్రాంతంలో ఉప్పు చ‌ల్లితే అవి మాయ‌మ‌వుతాయి. ఉప్పును వేడి నీళ్ల‌లో క‌లిపి చ‌ల్లినా కూడా చీమ‌లు మాయ‌వుతాయి.  

Latest News