ఎద ఎత్తుల‌తో కుర్ర‌కారుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తెలుగ‌మ్మాయి.. ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు..!

  • Publish Date - November 30, 2023 / 02:21 PM IST

అందం, అభిన‌యం ఉన్న‌ప్ప‌టికీ కూడా తెలుగమ్మాయిలు పెద్ద‌గా అవ‌కాశాలు అందిపుచ్చుకోవ‌డం లేదు. కార‌ణం ఏంటో తెలియ‌దు కాని అందాల ముద్దుగుమ్మ‌లు కెరీర్‌లో చాలా వెన‌క‌ప‌డిపోతున్నారు. వరంగల్ అమ్మాయి అచ్చ తెలుగు పిల్ల ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టే ఈ అందాల ముద్దుగుమ్మ సినిమా అవ‌కాశాలు అంతంత మాత్ర‌మే అందుకుంటుంది. డస్కీ అందాలతో ఉక్కిరి బిక్కిరి చేసే ఈషాని టాలీవుడ్ దర్శకులు ఎందుకు పట్టించుకోవడం లేదో ఇప్ప‌టికీ కూడా ఎవ‌రికి అర్థం కావడం లేదు.

గతంలో ఈషా మీడియం ఓ రేంజ్ చిత్రాలు చేసి అల‌రించింది. రీసెంట్‌గా దయ లాంటి వెబ్ సిరీస్ తో హిట్ కొట్టింది. కానీ ఆమె గ్లామర్ కి తగ్గ ఆఫర్స్ అందుకోవడం లో మాత్రం వెన‌క‌బ‌డుతుంది అనే చెప్పాలి. తెలుగు అమ్మాయిల‌కి అవ‌కాశాలు అంత‌గా రాని స‌మ‌యంలో కూడా ఈషా రెబ్బా అడ‌పాద‌డ‌పా త‌న ప్ర‌తిభ‌, గ్లామ‌ర్‌తో సినిమా అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది. ఈషాకి మంచి అవకాశాలు రావాలని, కమర్షియల్ చిత్రాల్లో కూడా రాణించాలని ఫ్యాన్స్ ఎంత‌గానో కోరుకుంటున్నారు. అయితే ఈషా రెబ్బా ఎప్ప‌టి నుండో కూడా తాను గ్లామ‌ర్ రోల్స్‌లో న‌టించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు సంకేతాలు పంపుతూనే ఉంది.

తాజాగా సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో అద‌ర‌గొట్టింది. నార్త్ భామ‌ల‌కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఈషా అందాల ఆర‌బోత అద‌ర‌హో అనే చెప్పాలి. పైట కొంగు ప‌క్క‌కి జ‌రిపి త‌న ఎద ఎత్తుల‌తో ఈషా రెబ్బా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈషా రెబ్బా తన సొగసుతో హొయలు పోతూ కుర్రాళ్ళకి మెంట‌లెక్కిస్తుంది. వ‌య్యారంగా ఈషా రెబ్బా చిరునవ్వులు చిందిస్తూ కుర్ర హృదయాల్లో మంటలు పుట్టించ‌గా, ఆమె చిరునవ్వులు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. ఈషా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా ఆమె విరబూసిన రోజాలా మంత్ర ముగ్ధుల‌ని చేస్తుండ‌డంతో ప్ర‌స్తుతం ఈషా పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Latest News