Tarun Bhascker – Eesha Rebba |తరుణ్ భాస్కర్–ఈషా రెబ్బా ప్రేమాయణం? : టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

టాలీవుడ్‌లో తరుణ్ భాస్కర్–ఈషా రెబ్బా ప్రేమ రూమర్స్ మళ్లీ హాట్‌టాపిక్. తరుణ్ భాస్కర్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలతో ఈషా రెబ్బాతో ప్రేమ కబుర్లు మళ్లీ వేడెక్కాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికీ అధికారిక నిర్ధారణ లేదు.

Tarun Bhascker and Eesha Rebba captured in a candid momen

Tarun Bhascker Reacts to Romance Rumours With Eesha Rebba at Film Event

💕ఈషా రెబ్బాతో ప్రేమాయణం? ఈవెంట్‌లో ఓపెన్ అయిన తరుణ్ భాస్కర్!
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పేరు ఈ మధ్యకాలంలో హీరోయిన్ ఈషా రెబ్బాతో జతగా వినబడుతోంది. వీరిద్దరూ ఓం శాంతి శాంతి శాంతి సినిమాలో జంటగా నటిస్తుండగా, దీపావళి పార్టీల్లో కలిసి కనిపించడం, తాజా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో “నాదే గ్రేట్ లవ్ స్టోరీ” అంటూ తరుణ్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

 (విధాత వినోదం డెస్క్​), హైదరాబాద్​:

టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో లవ్ న్యూస్, సీక్రెట్ ఎఫైర్స్, వెడ్డింగ్ బజ్ వరుసగా మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అదే దోవలో ఇప్పుడు దర్శకుడు తరుణ్ భాస్కర్ పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. కొంతకాలంగా సోషల్ మీడియాలో ఆయన, నటి ఈషా రెబ్బా గురించి “సమ్​థింగ్​.. సమ్​థింగ్..” అనే గాసిప్స్ తిరుగుతున్నాయి. అయితే ఇవన్నీ వింటూ నిశ్శబ్దంగా ఉన్న తరుణ్, తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో మాత్రం ఓపెన్‌గా యిపోవడంతో ఈ రూమర్లు మరింత వేడెక్కాయి.

వరంగల్‌కు చెందిన తరుణ్ భాస్కర్ 2016లో వచ్చిన పెళ్లిచూపులుతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు. అనంతరం నగరానికి ఏమైంది, పిట్ట కథలు, కీడా కోలా వంటి సినిమాలతో దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ బిజీ అయ్యారు. మరోవైపు వరంగల్​కే చెందిన ఈషా రెబ్బా, పదేళ్లకుపైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, ఇప్పటికీ చిత్రపరిశ్రమలో నిలదొక్కుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వెబ్ సిరీస్‌లు, సినిమాలతో తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మపేరు గత కొద్ది నెలలుగా తరుణ్‌తో జత కలవడంతో గాసిప్స్‌కు లెక్కేలేనంత ఊపు వచ్చింది.

కాగా, తరుణ్​ భాస్కర్​కు ఇదివరకే పెళ్లైంది. తను లతా నాయుడు. తరుణ్​ దర్శకత్వం వహించిన పెళ్లిచూపులు, ఈ నగరానికేమైంది?, యూటర్న్​ తదితర చిత్రాలకు ప్రొడక్షన్​, కాస్ట్యూమ్​ డిజైనర్​గా పనిచేసింది. ప్రస్తుతం వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు తెలిసింది.

ఈవెంట్లో తరుణ్ కామెంట్స్ వైరల్ – ‘నాదే గ్రేటెస్ట్​ లవ్ స్టోరీ!’

ఇటీవల జరిగిన రాజు వెడ్స్ రాంబాయి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ అడిగిన ప్రశ్నే అందరి దృష్టిని ఆకర్షించింది. “మీరు రియల్ లైఫ్‌లో చూసిన గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవరిది?” అని అడగగా, తరుణ్ వెంటనే నవ్వుతూ, అది నాదే… ప్రస్తుతం ఇంకా డుస్తోంది” అని సమాధానం ఇచ్చారు.

యాంకర్ కూడా సరదాగా, పేరు నాకు తెలుసు… కానీ బయటకు చెప్పను” అని చెప్పడంతో, అక్కడున్న ప్రేక్షకులు నవ్వుల్లో మునిగిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, నెటిజన్లు వెంటనే ఈషా రెబ్బా పేరును లింక్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

ఇంతే కాదు, ఇటీవల జరిగిన దీపావళి వేడుకల్లో ఈషా–తరుణ్ కలిసి హాజరయ్యారని ప్రచారం రావడంతో ఊహాగానాలకు ఇంకాస్త బలం చేకూరింది. అన్నట్లు వీరిద్దరూ తిరుమల కూడా సందర్శించారు. వారితోపాటు తరుణ్​ తల్లి, నటి గీతా భాస్కర్​ కూడా ఉంది.  ప్రస్తుతం వీరిద్దరూ ఓం శాంతి శాంతి శాంతి సినిమాలో జంటగా నటిస్తున్నారు. అదే షూటింగ్ సమయంలో స్నేహం ప్రేమగా మారిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్నప్పటికీ, ఇద్దరూ అధికారికంగా ప్రకటన చేయలేదు.

మొత్తానికి తరుణ్ భాస్కర్ కామెంట్స్‌తో టాలీవుడ్‌లో కొత్త హాట్ టాపిక్ మొదలైంది. సోషల్ మీడియా మాత్రం ఫిక్స్ అయిపోయినట్టే ఉన్నా —అసలు నిజం ఎప్పుడు బయటపడుతుందో చూడాలి!

Latest News