Viral Video |అడవికి మృగరాజులైన సింహాలు.. ఇతర జంతువులను వేటాడుతాయి. కంటికి కనిపించిన ప్రతి జంతువు రక్తాన్ని కళ్లారా చూసే వరకు సింహాలు పోరాడుతాయి. దీంతో ఆ క్రూరమృగాల నుంచి తప్పించుకునేందుకు ఇతర జంతువులు తీవ్ర ప్రయత్నాలు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆ జంతువులు సింహాలతో పోటీకి వెనుకాడవు. సింహాలతో బర్రె జీవన్మరణ పోరాటానికి సంబంధించిన 2 నిమిషాల 20 సెకన్ల ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ అడవిలో ఓ బర్రె దారి వెంట వెళ్తుంది. అంతలోనే ఓ సింహాం బర్రెను అటాక్ చేసింది. బర్రె మెడను పట్టుకుని, చంపేందుకు యత్నించింది. కానీ బర్రె తన కొమ్ములను ఉపయోగించి, సింహాం నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా యత్నించింది. అంతలోనే మరో సింహాం బర్రెపై దాడి చేసి, తోక భాగంలో నోటితో గట్టిగా అదిమిపట్టుకుంది. ఇక ఆ రెండు సింహాలతో 2 నిమిషాలకు పైగా బర్రె పోరాటం చేసింది. కొమ్ములను ఉపయోగించి, మృగరాజులకు బర్రె ముచ్చెటమలు పట్టించింది. చివరకు సింహాలను బర్రె తరిమికొట్టింది. అక్కడే ఉన్న ఓ చెరువులోకి బర్రె వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను సఫారీకి వెళ్లిన టూరిస్టులు తమ కెమెరాల్లో బంధించారు.
— عالم الحيوان (@Animal_WorId) June 8, 2023