Two-Headed Buffalo Calf | ఇది అరుదైన సంఘటన.. ఎవరూ ఊహించని విధంగా ఓ బర్రె.. రెండు తలలతో కూడిన దూడ( Two-Headed Buffalo Calf )కు జన్మనిచ్చింది. ఈ అరుదైన దృశ్యం మహారాష్ట్ర( Maharashtra )లోని కొల్హాపూర్( Kolhapur )లో వెలుగు చూసింది.
మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలోని కగాల్ తాలుకా పరిధిలోని బనాగే గ్రామానికి( Banage Village ) చెందిన రైతు సురేశ్ సుతార్ బర్రెలను( Buffalo ) పెంచుకుంటున్నాడు. ఇందులోని ఓ బర్రె ఇటీవల దూడకు జన్మనిచ్చింది. అయితే ఈ దూడ రెండు తలలను కలిగి ఉంది. నాలుగు కాళ్లు ఉన్నప్పటికీ తలలు మాత్రం రెండు ఉన్నాయి.
ఈ అరుదైన రెండు తలల దూడను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. పొరుగు గ్రామాల నుంచి కూడా సురేశ్ సుతార్ ఇంటికి జనాలు పోటెత్తారు. రెండు తలల బర్రె దూడను చూసి ఆశ్చర్యపోయారు.
ఇలా రెండు తలల బర్రె దూడ జన్మించడాన్ని పాలీసెఫాలీగా పరిగణిస్తారని పశు వైద్యులు పేర్కొన్నారు. పిండం ఎదిగే క్రమంలో రెండుగా విడిపోవడం కారణంగానే ఇలా జరిగి ఉండొచ్చని తెలిపారు. ఒకే శరీరానికి రెండు తలలు ఉండడం, వాటి మనుగడ కొంత కష్టంగానే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.