Site icon vidhaatha

బ‌ర్రెల దొంగ‌త‌నం.. మ‌హిళ‌ను స్తంభానికి క‌ట్టేసిన గ్రామ‌స్తులు

వ‌రంగ‌ల్ : ఈజీగా మ‌నీ సంపాదించేందుకు, విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డిపేందుకు చాలా మంది దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతుంటారు. ఇండ్ల‌లో, దుక‌ణాల్లో, బ్యాంకుల్లో దోపిడీల‌కు పాల్ప‌డుతుంటారు దొంగ‌లు. కానీ ఈ గ్యాంగ్ మాత్రం బ‌ర్రెల దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. వ‌రంగ‌ల్ జిల్లా స‌ర్వ‌పురం గ్రామంలోకి సోమ‌వారం రాత్రి న‌లుగురు దొంగ‌లు ప్ర‌వేశించారు. వేముని స్వామి ఇంటి వ‌ద్ద క‌ట్టేసిన నాలుగు బ‌ర్రెల‌ను ఆ న‌లుగురు అప‌హ‌రిస్తుండ‌గా, పెద్ద శ‌బ్దం వ‌చ్చింది. దీంతో గ్రామ‌స్తులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. దొంగ‌ల‌ను గ్రామ‌స్తులు వెంబ‌డించారు. నలుగురిలో ముగ్గురు త‌ప్పించుకోగా, ఓ మ‌హిళ గ్రామ‌స్తుల‌కు దొరికింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని, ఓ స్తంభానికి తాళ్ల‌తో క‌ట్టేశారు. అనంత‌రం ఆమెను చిత‌క‌బాదారు. అయితే దొంగిలించిన బ‌ర్రెల‌ను వేరే ప్రాంతాల‌కు తీసుకెళ్లి, విక్ర‌యిస్తున్న‌ట్లు ఆమె తెలిపింది.

Exit mobile version